హాలీవుడ్‌ స్థాయిలో 'దేవర' నిర్మాణం!

హాలీవుడ్‌ స్థాయిలో 'దేవర' నిర్మాణం!

2 months ago | 5 Views

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, సినీ ప్రియులను అలరించేందుకు ఎన్టీఆర్‌ 'దేవర’తో సిద్ధమయ్యారు. యంగ్‌టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్‌ రాబట్టి అంచనాలను అమాంతం పెంచేసింది. ఎన్టీఆర్‌ నుంచి దాదాపు ఆరేళ్ల సుధీర్ఘ గ్యాప్‌ తర్వాత వస్తున్న సోలో సినిమా ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకొని అంచనాలను రెట్టింపు చేశారు. 'బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తెరకెక్కించారని ఆలోచిస్తూనే ఉన్నా. ఇది అద్భుతమైన యాక్షన్‌ డ్రామా. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించాలంటే మంచి ప్రయోగాలు చేయొచ్చు. ప్రేక్షకులకు ఫ్రెష్‌ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో 95 శాతం రీరికార్డింగ్‌ పనులను విదేశాల్లోనే పూర్తి చేశాం.


'దేవర’ సినిమా చూస్తున్నప్పుడు విూకు 'అవెంజర్స్‌’,'బ్యాట్‌మ్యాన్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఎమోషన్‌, డ్రామా, యాక్షన్‌, ఆవేశం, అన్నీ ఉన్నాయి. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఈ సినిమాను ఫస్ట్‌ డే, ఫస్ట్‌ షో చూడాలనుకుంటున్నా. కొరటాల శివ నన్ను హైదరాబాద్‌లో ఏ థియేటర్‌కు తీసుకెళ్లినా నాకు ఇష్టమే. అభిమానులతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా. మేము ఈ సినిమాను ఎంత ఎంజాయ్‌ చేశామో వారు కూడా అదేస్థాయిలో ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ తెలుగు తెరపై మెరవనున్నారు. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించారు. నందమూరి కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

ఇంకా చదవండి: 'దేవర'కు స్టీల్‌ ప్లాంట్‌ సెగ!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Devara     # Janhvikapoor     # Saifalikhan     # September27