ప్రతిభ నిరూపించుకునే పాత్ర అది: మేఘా ఆకాశ్‌

ప్రతిభ నిరూపించుకునే పాత్ర అది: మేఘా ఆకాశ్‌

1 month ago | 22 Views

విజయ్‌ ఆంటోనీ హీరోగా విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వం వహించిన 'మళై పిడిక్కాద మనిదన్‌’ (తెలుగులో తుఫాన్‌) చిత్రంలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని, ఇది తన సినీ కెరీర్‌కు ఓ టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుందని ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మేఘా ఆకాష్‌ అభిప్రాయ పడింది.  ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆమె విూడియాతో మాట్లాడుతూ.. 'సాధారణంగా విజయ్‌ మిల్టన్‌ రూపొందించే సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర ఎంతో బలంగా ఉంటుంది.

ఈ సినిమాకు నన్ను సంప్రదించకముందే, స్టోరీ వినకముందే నా మనసులో ఒక బలమైన ముద్ర పడిరది. ఖచ్చితంగా ఈ సినిమాల్లో నా పాత్ర బాగా ఉంటుందని ఊహించాను. నేను అనుకున్నట్టుగానే సినిమాలో మంచి పాత్ర లభించింది. ప్రతిభ నిరూపించుకునేందుకు ఓ మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్‌ లో మొత్తం మరిచిపోలేని ఎన్నో అనుభూతులు మిగిలాయి. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

ఇంకా చదవండి: అభిమానుల కోరిక..సెల్ఫీ ఇచ్చిన మహేశ్‌ బాబు

# MeghaAkash     # Tollywood    

trending

View More