ఆ ట్యాగ్‌ ఇచ్చింది మీరే : బన్నీ సంచలన కామెంట్స్‌

ఆ ట్యాగ్‌ ఇచ్చింది మీరే : బన్నీ సంచలన కామెంట్స్‌

4 days ago | 5 Views

'పుష్ప-2 ది రూల్‌’ మూవీ ప్రమోషన్స్‌ యమా జోరుగా సాగుతున్నాయి. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూసేందుకు అంతా సిద్ధమవ్వండి అంటూ చిత్రయూనిట్‌ సైతం చెబుతోంది. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలవడమే కాకుండా.. మరిన్ని అవార్డులను తెచ్చిపెడుతుందని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాను సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. డిసెంబరు 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే బీహార్‌లోని పాట్నాలో జరిగిన ‘పుష్ప-2’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలవగా.. చెన్నయ్‌లో జరిగిన వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్‌గా నిలిచింది. ఐకాన్‌ స్టార్‌ ఎక్కడికి వెళితే అక్కడ ఆయన అభిమానులు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెబుతున్నారు. తాజాగా ఈ చిత్రం మరో గ్రాండ్‌ ఈవెంట్‌ కేరళలోని కొచ్చిలో ఎంతో ఘనంగా నిర్వహించారు మేకర్స్‌. కేరళలో మల్లు అర్జున్‌గా అత్యధిక అభిమానులు ఉన్న తెలుగు హీరోగా పేరున్న అల్లు అర్జున్‌కు అక్కడ అశేష జనాదరణ లభించింది.

Allu Arjun: నాకు ఆర్మీ అనే ట్యాగ్ ఇచ్చిందే మీరు.. బన్నీ సంచలన వ్యాఖ్యలు |  Allu Arjun Sensational Comments at Pushpa 2 Kerala Event KBK

ఐకాన్‌ స్టార్‌ కోసం ఈ వేడుకకు భారీగా జనాలు తరలి రావడం విశేషం.  ఇక ఈ కార్యక్రమంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. థ్యాంక్యూ కేరళ. మీ అడాప్టెడ్‌ సన్‌ అల్లు అర్జున్‌కు మీరిచ్చిన ఈ గ్రాండ్‌ వెలకమ్‌ మరిచిపోలేను. గత 20 ఏళ్ల నుంచి మీరు నాపై ప్రేమ చూపిస్తున్నారు. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకం. ఈ చిత్రంలో మలయాళ గొప్ప నటుడు ఫహాద్‌ ఫాజిల్‌తో పనిచేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో ఆయన నటన చూసి మీరంతా గర్వపడతారు. నా సినిమా కోసం మీరు మూడేళ్లుగా వెయిట్‌ చేస్తున్నారని తెలుసు. తప్పకుండా ఇక నుంచి తొందరగా సినిమాలు చేస్తాను. ఈ సినిమాలో రష్మికా తన నటనతో మెప్పిస్తుంది. రష్మికతో పనిచేయడం ఎంతో కంఫర్ట్‌గా అనిపించింది. సుకుమార్‌ నా కెరీర్‌లో ‘ఆర్య’ను ఇచ్చాడు. ‘ఆర్య’ చిత్రంతోనే నా మార్కెట్‌ కేరళలో స్టార్ట్‌ అయ్యింది. దర్శకుడు సుకుమార్‌ వల్లే నేను మీకు దగ్గరయ్యాను. నా కెరీర్‌లో దేవి శ్రీప్రసాద్‌ ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చాడు. నా చిత్రానికి పనిచేసిన మలయాళీ రైటర్స్‌ అందరికీ కూడా చాలా థ్యాంక్స్‌. మైత్రీ నవీన్‌, రవి, చెర్రీల సపోర్ట్‌ వల్ల ఈ సినిమా సాధ్యమైంది.

ఇంకా చదవండి: హీరో ధనుష్‌, ఐశ్వర్యలకు విడాకులు మంజూరు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# పుష్ప2దిరూల్‌     # అల్లుఅర్జున్‌     # సుకుమార్‌