నా ఫిట్‌నెస్‌కు కారణం అదే...!
12 days ago | 5 Views
‘గడిచిన జీవితం అంతా చదువు, ఆటలతోనే సరిపోయింది. నిజానికి నా లైఫ్‌లో సరదాలు తక్కువే. చిన్నప్పట్నుంచీ క్రమశిక్షణతోనే పెరిగాను. నాన్న సోల్జర్ కావడంతో ఇల్లాంతా ఆర్మీ వాతావరణమే ఉండేది.’ అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఆమె మాట్లాడింది. ‘నాన్నకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. అందుకే చిన్నప్పట్నుంచీ నన్ను స్పోర్ట్స్ వైపు నడిపించారు. నేను స్విమ్మింగ్, బ్యాట్మింటన్‌లో స్టేట్ లెవల్ ప్లేయర్‌ని.
నా ఫిజిక్ ఫిట్‌గా ఉండటానికి కారణం అదే. నాన్న ద్వారా అబ్బిన ప్రపంచజ్ఞానం నన్ను మిస్ ఇండియాగా నిలబెట్టింది. హీరోయిన్ అవుతానని మాత్రం అస్సలు అనుకోలేదు. ఓ విధంగా ఇదంతా మా నాన్న ఆశీర్వాదం’ అంటూ ఆనందం వెలిబుచ్చింది మీనాక్షి చౌదరి. వెంకటేశ్‌కి జోడీగా ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇంకా చదవండి: 'పుష్ప-3'లో విజయ్ దేవరకొండ హీరో..?
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# మీనాక్షిచౌదరి # సంక్రాంతికివస్తున్నాం