తలైవా బర్త్‌డే గిఫ్ట్... 'జైలర్-2' షూటింగ్ షురూ..!
22 days ago | 5 Views
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్- కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వచ్చిన 'జైలర్' బాక్సాఫీస్ ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ 'జైలర్-2' కూడా వస్తుందని తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఆసక్తికర వార్త ఒకటి తెరపైకి వచ్చింది. సీక్వెల్ షూటింగ్‌కు అంతా రెడీ అయినట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. తాజా టాక్ ప్రకారం 'జైలర్- 2' ప్రోమో షూట్‌ను డిసెంబర్ 5న జరుపనున్నారని ఇన్‌సైడ్ టాక్. అంతేకాదు తలైవా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న 'జైలర్- 2' ప్రోమోతోపాటు కూలీ న్యూ లుక్ పోస్టర్‌ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే అభిమానులు, మూవీ లవర్స్‌కు పండగే అని చెప్పొచ్చు.
'జైలర్- 2' స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ క్లారిటీ ఇచ్చాడని తెలిసిందే. 'జైలర్' ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి , మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. మరి వీరంతా సీక్వెల్‌లో కూడా ఉంటారా..? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. రజినీకాంత్ మరోవైపు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న 'కూలీ' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ 2025లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇంకా చదవండి: 'ది పారడైజ్'తో ప్రేక్షకుల ముందుకు నాని.. మోహన్‌బాబు, నానిల మధ్య రసవత్తర సన్నివేశాలు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# జైలర్2 # రజినీకాంత్ # దిలీప్‌కుమార్