తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3: వైరల్ గా మారిన తమన్ మదర్ ప్రజెన్స్
3 months ago | 32 Views
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రసవత్తరంగా జరుగుతోంది. ప్రతి వారం ఎపిసోడ్ అభిమానులకు థ్రిల్ పంచుకున్నాయి. ఇప్పుడీ మెగా మ్యూజిక్ షోలో మరో స్పెషల్ మూమెంట్. ఈ షోకి జడ్జ్ గా ఉంటున్న సెన్సేషనల్ కంపోజర్ తమన్ అమ్మ గారు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
తమన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ చిన్నప్పటి ముచ్చట్లు చెప్పారు.
తమన్ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా మైదానంలోనే ఎక్కువగా వుండేవాడని, తనకి అస్సలు భయం లేదని, స్కూళ్లలో గొడవలు వచ్చేవని చెప్పారు.
తొటి పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లయింట్ లు వుండేవని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఐతే తను హార్డ్ వర్కర్ చేస్తాసడని, వర్క్ అయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడని, సంగీతం క్రికెట్ తనకి మరో ప్రపంచం లేదని .. ఇలా చాలా సంగతులు చెప్పారు.
ఈ ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్ ఎపిసోడ్ కోసం ఆహా లో శుక్రవారం,శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ని మిస్ అవ్వకండ
ఇంకా చదవండి: 1980 నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం అందర్నీ ఆకట్టుంకుంటుంది: డైరెక్టర్ వైవిఎస్ చౌదరి
# TeluguIndianIdol3 # SThaman