తమిళనాట 'దేవర' ప్రమోషన్... ఓ సినిమా చేయాలంటూ వెట్రిమాన్‌ను కోరిన ఎన్టీఆర్
2 months ago | 34 Views
'దేవర’ సినిమాకు పని చేసిన వారిని.. వారి కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోనని ఎన్టీఆర్ అన్నారు. ఈ చిత్రం అందరికీ ప్రత్యేకమేనని పేర్కొన్నారు. చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌విూట్‌లో ఆయన మాట్లాడారు. ‘చెన్నై నాకెంతో ప్రత్యేకం. బాల్యంలో కూచిపూడి నృత్యం ఇక్కడే నేర్చుకున్నా. 'దేవర’కు మూలస్తంభాలైన దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ తదితరులతో వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. మన భాషలు వేరు కావొచ్చు. కానీ, మనందరినీ ఒక్కటిగా చేసేది సినిమా. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్ అనేవి పేరుకు మాత్రమే. ప్రేక్షకులంతా ఒక్కటేనని బాక్సాఫీసు వద్ద ఎన్నో సినిమాలు నిరూపించాయి. తెలుగు సినిమా పరిశ్రమకు తొలి అడుగు చెన్నైలోనే పడింది. సినిమా ప్రమోషన్స్‌కు ఈ నగరం కూడా కీలకంగా మారిందని అన్నారు.
వెట్రిమారన్ సర్.. తమిళ్‌లోనైనా నాతో ఒక సినిమా చేయండి. మేం దాన్ని తెలుగులో డబ్ చేసుకుంటాం‘ అని దర్శకుడిపై అభిమానాన్ని చాటుకున్నారు ఎన్టీఆర్. ‘ఎన్టీఆర్ 30’ (దేవర) సినిమాకి అనిరుధ్ పని చేయాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి, ట్రెండింగ్ లో నిలిపారు. ఆ తర్వాత కొరటాల శివ నన్ను కలిసి, బేసిక్ ఐడియా చెప్పారు. హైదరాబాద్‌లో నా ఫ్రెండ్ తారక్ అన్న. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టం. 'దేవర’పై నాకు, నా టీమ్‌కు ఎంతో నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వంగా ఫీలవుతున్నాం అని సంగీత దర్శకుడు అనిరుధ్ అన్నారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. చెన్నై నాకు స్పెషల్. అమ్మ (శ్రీదేవి)కు ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలుండేవి. తమిళ సినిమాలో నటించాలని ఆకాంక్షిస్తున్నా.'దేవర’ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ఈ చిత్రం విూ అందరికీ నచ్చుతుందనుకుంటున్నా అని పేర్కొన్నారు.
ఇంకా చదవండి: 'దేవర' రామాయణం స్పూర్తితో తీసారేమో... ట్రైలర్ చూసి అంచనా వేసిన రచయిత పరుచూరి!