'గేమ్ చేంజర్' టీజర్ డేట్ ఛేంజ్.. దసరాకు కాదు...దీపావళికి అంటూ తమన్ పోస్ట్!
2 months ago | 5 Views
రామ్‌చరణ్-శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్’ టీజర్ దసరాకు రావడం లేదు. దీపావళికి వస్తుందని తాజాగా దీనిపై సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ పెట్టారు. టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దసరాకు టీజర్ రాలేదని నిరాశపడొద్దు ఫ్రెండ్స్. టీమ్ నిరంతరం ఆ పనుల్లోనే ఉంది. ప్రతినెలా ఒక లిరికల్ పాటను విడుదల చేయడం కోసం అన్ని పాటలకు లిరిక్స్ వర్క్స్ పూర్తి చేశాం. ఈ నెలలో అక్టోబర్ 30న ఒక పాట రానుంది. సినిమా డిసెంబర్ 20న కచ్చితంగా విూ ముందుకువస్తుంది’ అని పోస్ట్ పెట్టారు. 'రా మచ్చా..’ సాంగ్ వంద మిలియన్ల వ్యూస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇక ఓ నెటిజన్‌కు రిప్లై ఇస్తూ.. దీపావళికి టీజర్ ఉంటుందన్నారు. ’దీని టీజర్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారని మేం అర్థం చేసుకోగలం. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. అవుట్‌పుట్ కోసం ఎక్కడా రాజీపడడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయి.
దసరాకు విడుదల కాకపోతే దీపావళికి టీజర్ ఉంటుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ నేను ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. విూరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని అన్నారు. ’గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే.. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇంకా చదవండి: తొలినాళ్లలో ఎంతో కష్టపడాల్సి వచ్చింది: తృప్తి
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Gamechanger # Ramcharan # Kiaraadvani # ThamanS