తెలుగు తెరకు పరిచయం అవుతున్న టాలెంటెడ్ హీరోయిన్ భైరవి
1 month ago | 5 Views
టాలీవుడ్ స్క్రీన్ కు ఓ కొత్త గ్లామర్ యాడ్ కాబోతుంది. అందం, అభినయం కలగలిసిన భైరవి # Bhairavi తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. 'సర్కార్ నౌకరి' ఫేమ్, ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్‌గా భైరవి (#Bhairavi ) నటించింది. ఇది ఆమెకు డెబ్యూ మూవీ అయినప్పటికీ తన ప్రతిభతో ఎంతో పరిణితితో నటించింది. సెంటిమెంట్, ఎమోషనల్ వంటి సీన్లలో భైరవి యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమా విడుదల తర్వాత భైరవిని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు.
శివ దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియర్ నటీనటులు రఘుబాబు, పృద్వి, ప్రభావతి తదితరులు నటించారు.
ఈ సందర్భంగా నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ... ''ఈ మూవీ విలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో రూపొందిస్తున్నాం. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ చిత్రం. సర్కార్ నౌకరి ఫేమ్ ఆకాష్ హీరోగా నటించే ఈ సినిమా కోసం హీరోయిన్ గా భైరవి తెలుగు తెరకు తొలి పరిచయం చేస్తున్నాం. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో భైరవి సరిగ్గా సరిపోతుంది. హీరోకి మరదలు పాత్ర చేస్తుంది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్ గా ఉండబోతోంది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలము. ప్రస్తుతం మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నది. త్వరలోనే సినిమా టైటిల్, విడుదల తేదీ ప్రకటిస్తాం.'' అని అన్నారు.
నటీనటులు: ఆకాష్ (హీరో), భైరవి (హీరోయిన్), రఘు బాబు, పృద్వి, ప్రభావతి, మహేందర్, డిడి శ్రీనివాస్, కిట్టయ్య తదితరలు.
బ్యానర్: తధాస్తు క్రియేషన్స్
ప్రొడక్షన్ నెంబర్:1
దర్శకత్వం:శివ
నిర్మాత: తాటి బాలకృష్ణ
సహ నిర్మాత: తాటి భాస్కర్
సంగీతం: యశ్వంత్
హీరో:ఆకాష్
హీరోయిన్:భైరవి
పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.
ఇంకా చదవండి: ఈడీ తీరుపై మండిపడ్డ దర్శకుడు శంకర్ .. ఆస్తుల అటాచ్‌మెంట్ అక్రమమని వెల్లడి
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"