తాప్సీ పెళ్లి వీడియో వైరల్‌!

తాప్సీ పెళ్లి వీడియో వైరల్‌!

2 months ago | 16 Views

రీసెంట్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ , సోనారిక, విూరా చోప్రా వంటి హీరోయిన్లు పెళ్లి చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వారి బాటలోనే మరో హీరోయిన్‌ తాప్సీ కూడా నడిచింది. తాప్సీ సీక్రెట్‌గా తన బాయ్‌ఫ్రెండ్‌ మథియాస్‌ బోని పెళ్లాడింది.  తాప్సీ` మథియాస్‌ బోల పెళ్లి మార్చి 23న అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సీక్రెట్‌గా జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు లీకైంది.

ఈ లీకైన వీడియో సోషల్‌ మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. 'హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  వీడియోలో తాప్సీ సంప్రదాయ దుస్తుల్లో, కూలింగ్‌ గ్లాస్‌ పెట్టుకుని సరదాగా డ్యాన్స్‌ చేసుకుంటూ పెళ్లి వేదికపైకి చేరుకోగా.. ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ మథియాస్‌ బో  ఆమెకు హగ్‌తో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్‌ అవుతోంది. మథియాస్‌ బోతో తాప్సీకి ఎప్పటి నుండో పరిచయం ఉంది. వారి ప్రేమను కుటుంబ సభ్యులు వ్యతిరేకించినట్లుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇంట్లో అందరినీ ఒప్పించే.. తన ప్రియుడిని పెళ్లాడతానని తాప్సీ చెప్పినట్లే.. ఇప్పుడు అందరి సమక్షంలో తన వివాహాన్ని ముగించింది.

ఇంకా చదవండి: సినీ సౌండ్ ఇంజనీర్ కి '‘మనం సైతం' కుటుంబం నుంచి ఆర్థిక సాయం

# Taapsee Pannu     # Mumbai     # Bollywood    

trending

View More