నిలకడగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం!
2 months ago | 5 Views
సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వైద్యులు తలైవాకి చిన్నపాటి సర్జరీ చేశారు. అనుభవజ్ఞులైన ముగ్గురు వైద్యులు రజనీకాంత్‌కు పొత్తికడుపు కింది భాగంలో స్టెంట్ వేశారు. ఈ పక్రియ విజయవంతమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. రెండు లేదా మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. రజనీకాంత్ సోమవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో దవాఖానాకు తరలించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీశ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం సూపర్‌స్టార్‌కు చికిత్స అందిస్తున్నారు. ఇక తలైవా దవాఖానలో చేరిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ విూడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రజనీకి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
ఇంకా చదవండి: ఆ లెజండరీల గురించి నా పిల్లలకు చెబుతా : నటి శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర పోస్ట్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !