సుమంత్‌ పెళ్లి కామెంట్లు..  మీనాక్షి చౌదరి రియాక్షన్‌!

సుమంత్‌ పెళ్లి కామెంట్లు.. మీనాక్షి చౌదరి రియాక్షన్‌!

1 month ago | 5 Views

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ లీడింగ్ లో కొనసాగుతోంది మీనాక్షి చౌదరి. సుశాంత్‌ నటించిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ  ఇటీవలే 'లక్కీ భాస్కర్‌' సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టింది. ఈమె  అక్కినేని సుశాంత్‌ను పెళ్లి చేసుకోబోతుందని ఇండస్ట్రీ సర్కిల్‌లో వార్తలు హల్‌ చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై మీనాక్షి చౌదరి క్లారిటీ ఇచ్చేసింది. 'మెకానిక్‌ రాకీ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా ఈ విషయమై మాట్లాడుతూ.. తాను కూడా ఈ పుకార్లను విన్నానని చెప్పింది.


వెడ్డింగ్‌ అంటూ వస్తోన్న వార్తలను కొట్టిపారేస్తూ.. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసింది. అంతేకాదు 'సలార్‌ -2'లో తాను భాగస్వామ్యం అవుతున్నట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని చెప్పింది. తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఏదైనా ముఖ్యమైన విషయముంటే అందరితో షేర్‌ చేసుకుంటానంది. మీనాక్షి చౌదరి ఇటీవలే 'మట్కా'తో ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.  మరోవైపు వెంకటేశ్‌-అనిల్‌ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.

ఇంకా చదవండి: ముఫాసా పాత్రకు టాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ బాబు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# సుమంత్‌     # మీనాక్షి చౌదరి    

trending

View More