ఆ సినిమాలో రామ్‌చరణ్‌తో గిన్నెలు తోమించిన సుకుమార్
15 days ago | 5 Views
తండ్రికైన కొడుకుపైన మమకారం ఎక్కువే ఉంటుంది. కొడుకుకి ఏమైందని తెలిస్తే తండ్రి అల్లాడిపోతాడు. రామ్ చరణ్ విషయంలో చిరంజీవి కూడా ఓ సారి చాలా బాధని దిగమింగుకున్నాడట. మగధీర సినిమా సమయంలో చరణ్ కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటే చిరంజీవి చూడా ఎంతగానో భయపడ్డారంట. అప్పుడే తన తండ్రి కూడా చిరంజీవి చేసే స్టంట్స్ చూసి ఎంత బాధపడ్డారోనని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదే కాక మెగా వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఆయనతో దర్శకుడు సుకుమార్ గిన్నెలు తోమించాడట. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ రంగస్థలం. ఈ సినిమా ఎంత పెద్ధ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫేస్‌లోనే విభిన్న భావోద్వేగాలను పలికించి వాప్‌ా అనిపించాడు.
అప్పట్లో నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసన ఈ చిత్రం 200 కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్ అద్భుతమైన నటనతో అదరగొట్టాడు. చిత్రంలో రామ్ చరణ్.. గిన్నెలు తోమడం, టాయిలెట్ తీసే సీన్లు ఉన్నాయి. అయితే ఆ సీన్స్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోచేత సుకుమార్ చేయించడంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఆ సీన్స్ ఏదైన జిమ్మిక్కులు చేసి తీద్దామన్నా కూడా రామ్ చరణ్ తానే స్వయంగా చేస్తానని అన్నాడట. ఈ విషయం చిరంజీవికి తెలిశాక ఆయన రియాక్షన్‌కి వావ్ అనాల్సిందే. రోజూ ఇంట్లో గిన్నెలు తోమే అలవాటు ఉన్నట్టుగా రామ్ చరణ్ ఆ సీన్‌లో చేశాడని, చాలా అనుభవం ఉన్న వ్యక్తిలాగా, బాగా పాత్రలో ఇన్‌వాల్వ్ అయి చేశాడని, అందుకే అది అంత సహజంగా వచ్చిందని ఆ సన్నివేశం గురించి సుకుమార్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. చరణ్ అలా చేస్తుంటే మేము షాక్ అయ్యాం. చిరంజీవి ఈ సీన్ చూసి..ఈ సీన్ నువ్వే చేసి చూపించావ్ కదా చరణ్‌కి అని అడిగితే, లేదు సార్, నేను ఏం చెప్పలేదు. చరణ్ ఆ పాత్రని ఓన్ చేసుకొని నటించాడని సుకుమార్ అన్నాడట. చిరు అస్సలు నమ్మలేదు. అయితే రామ్ చరణ్ వంట చేసి రుచి చేసే సీన్ కూడా సహజంగా చేసాడని సుకుమార్ అన్నాడట. దానికి చిరు చాలా సర్‌ప్రైజ్ అయ్యాడట.
ఇంకా చదవండి: సినీప్రియులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్... రూ.200లకే సినిమా టికెట్లు పరిమితం