
ఇలాంటి అవకాశాలు ఒక్కసారే వస్తాయి : తమన్నా
1 month ago | 5 Views
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది.'శ్రీ' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. 'హ్యాపీడేస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన 'భోళాశంకర్'లో చేసింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే తమన్నా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది ఈ బ్యూటీ. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుందో. రీసెంట్ గా విడుదలైన ‘స్త్రీ 2’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓ వైపు సినిమాలు..మరో వైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగులో 'ఓదెల' అనే సినిమా చేస్తుంది. తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జీవితంలో ఒక్కసారే ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. కాశీలో ఈ చిత్రం ప్రారంభించిన నాటి నుంచి ఇందులో మ్యాజిక్ ఉందనే భావన కలిగింది. మేము ఏదైతే మ్యాజిక్ ఫీలయ్యామో ఆడియన్స్ కూడా అదే ఫీలవుతారని ఆశిస్తున్నా అని తమన్నా తెలిపింది.
ఇంకా చదవండి: నిజంగా ప్రభాస్ చాలా స్వీట్: కేరళ కుట్టి మాళవిక మోహనన్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఓదెల # తమన్నా