సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ.. జయంతి సందర్భంగా పలువురు నివాళి!
5 months ago | 51 Views
తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు కోడి రామకృష్ణది ఓ ప్రత్యేకస్థానం. ఎన్నో అణిముత్యాల లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు. ఆయన చిత్రాల్లో ఎన్నో కమర్షియల్ బ్లాక్ బస్టర్లు వున్నాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా.. గురువుకు తగ్గ శిష్యుడిగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కే.రాఘవ నిర్మించిన తొలిచిత్రం ’ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత ఆయన వరుస సినిమాలతో బిజీ అయిపోయారు.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పాటు, యాక్షన్ చిత్రాలు, రాజకీయ నేపథ్య చిత్రాలు, ఫిక్షన్ పాంటసీ, థ్రిల్లర్ ఇలా అన్ని తరహా చిత్రాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ రూపొందిచాడు. ఏ జోనర్ అయినా కోడి రామకృష్ణ సినిమా అంటే అప్పట్లో ఓ క్రేజ్.. చిన్న సినిమాలను పెద్ద విజయాలుగా నిలిపిన ఘనత ఆయనది. ఎ.ఎన్.ఆర్, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ వంటి హీరోలతో సంచలన విజయాల సాధించిన చిత్రాలను తెరకెక్కించి? తన దర్శకత్వ మార్క్‌ను అందరి హృదయాల్లో ముద్ర వేశాడు.
ఇప్పటి వరకు ఏ దర్శకుడికి లేని విజయాలు కోడి రామకృష్ణకు సొంతం చేసుకున్నాడు. కేవలం హీరోయిజమే కాకుండా అంకుశం వంటి చిత్రంలో రామిరెడ్డి, భారత్ బంద్ చిత్రంలో కాస్ట్యూమ్ కృష్ణ వంటి వాళ్లతో విలనిజాన్ని సరికొత్త యాంగిల్‌లో ఆవిష్కరించాడు. ఇప్పడున్న టెక్నాలజీతోనే కాకుండా అప్పట్లోనే ఆయన విఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ అంతంత మాత్రంగా వున్న సమయంలో దేవిపుత్రుడు, అమ్మోరు, అరుంధతి వంటి ఘన విజయాలతో అందర్ని అబ్బరుపడేలా చేశాడు. దాదాపు 120కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ శతాధిక దర్శకుడిగ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. అలాంటి దర్శక దిగ్గజం జయంతి సందర్భంగా ఆయనను నేటి దర్శకులందరూ గుర్తు చేసుకోవాలి. ఇక ప్రస్తుతం కోడి రామకృష్ణ వారసులుగా ఆయన కూతుళ్లు కోడి దివ్య, కోడి ప్రవళిక, దీప్తిలు నిర్మాతలుగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి మంచి సినిమాలు నిర్మించాలనే సంకల్పంతో వున్నారు.
ఇంకా చదవండి: 'ఫస్ట్ లవ్' సాంగ్ లో బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చాలా నచ్చింది. సాంగ్ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది: ఫస్ట్ లవ్ సాంగ్ టీజర్ లాంచ్ లో హీరో శ్రీవిష్ణు
# Chiranjeevi # Balakrishna # Venkatesh