సల్మాన్‌ఖాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్!
1 month ago | 5 Views
సల్మాన్ ఆప్త మిత్రుడు, ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ అనంతరం బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు సల్మాన్‌కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన వరుస బెదిరింపు కాల్స్ ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా మరోసారి సల్మాన్‌కి ఛాలెంజ్ విసురుతూ ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేశారు.
ఇంతకీ వాళ్ళు ఏమన్నారంటే.. సల్మాన్ ఖాన్-లారెన్స్ బిష్ణోయ్ ఈ చర్చ దేశంలో సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు సల్మాన్‌కి మరికొందరు బిష్ణోయ్ గ్యాంగ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్‌ని సపోర్ట్ చేస్తూ ఒక గేయ రచయిత పాట రాశారు. ఇందులో లారెన్స్ బిష్ణోయ్ పేరును కూడా ప్రస్తావించడంతో కొందరు ముంబై ట్రాఫిక్ పోలీసులకు కాల్ చేశారు. ఆ పాట రాసిన గేయ రచయిత నెల రోజుల్లో దారుణమైన పరిస్థితి ఎదురుకోవాల్సిందని, ముందులాగ రచనలు చేయలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక సల్మాన్‌కి దమ్ముంటే సదురు రచయితకి ఏం కాకుండా కాపాడుకోవాలిని ఛాలెంజ్ విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మరోవైపు సల్మాన్ ఖాన్‌ని వరుస బెదిరింపు కాల్స్‌తో ఆందోళనపరిచిన కొందరు ఇప్పుడు ‘షారుఖ్ ఖాన్’ని టార్గెట్ చేశారు. ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు కొందరు బాలీవుడ్ ‘బాద్ షా’ షారుఖ్‌ని టార్గెట్ చేశారు.
చంపేస్తామని కాల్ చేసి బెదించారు. దీంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. దీంతో ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే ఈ కాల్ చేసింది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నివాసి ఫైజాన్‌గా గుర్తించినట్లు తెలిసింది. అయితే మూలలను గుర్తించిన పోలీసులు రాయ్‌పూర్ లో విచారం చేపట్టారు. కాగా, బాబా సిద్ధిఖీ, షారుఖ్, సల్మాన్‌ల మధ్య మంచి స్నేహం ఉంది.
ఇంకా చదవండి: నిజజీవితంలో తల్లి కావాలని ఉంది : సమంత