ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకునే 'దేవర' కథ :  దర్శకుడు కొరటాల శివ

ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకునే 'దేవర' కథ : దర్శకుడు కొరటాల శివ

2 months ago | 31 Views

'దేవర’ రిలీజ్‌కు సిద్దమవుతున్న వేళ మూవీ టీమ్‌ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఓ వైపు ఇంటర్‌నెట్‌ లో కొరటాల శివ ఆచార్య , అల్లు అర్జున్‌ ప్రాజెక్ట్‌ పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. 'ఆచార్య’ మూవీ ప్లాప్‌ తో 'దేవర’ మూవీ ఎలా ఉండబోతుంది? తారక్‌ని ఎలా హ్యాండిల్‌ చేయగలడు? అనే చర్చ విపరీతంగా జరిగింది. ఒక దశలో 'ఆచార్య' ప్లాప్‌ బాధ్యత ఎవరిది? అన్న సందేహాలు కూడా గుప్పుమన్నాయి. దీంతో కొరటాల ఈ చర్చకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశాడు.

'ఆచార్య' సినిమా ప్లాప్‌ తనకు 'దేవర' తీసేటప్పుడు ఒత్తిడి కలిగించలేదని, అలాగే అందరికంటే ముందుగా చిరంజీవి గారే నువ్వు బౌన్స్‌ బ్యాక్‌ అవుతావు శివ అనే మెసేజ్‌ చేశారని అన్నారు. అంతేకాకుండా 'దేవర'కు ముందు అల్లు అర్జున్‌తో అనుకున్న ప్రాజెక్ట్‌ ఇది కాదని క్లారిటీ ఇచ్చారు. కాగా, మొన్నటి వరకు అల్లు అర్జున్‌తో షెల్వ్‌ అయిన ప్రాజెక్ట్‌ 'దేవర'నే అనే ఊహాగానాలు నడిచిన విషయం తెలిసిందే.' దేవర' మూవీని రెండు పార్ట్‌ లుగా తీయడానికే కథే కారణమన్నారు. కేవలం స్టోరీ నేరేట్‌ చేయడానికి 4 గంటల సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. 'దేవర' కథ కేవలం ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకునే  తయారు చేసిందని కూడా వివరించారు.

ఇంకా చదవండి: ఎన్టీఆర్‌గారితో జ‌ర్నీ నాకెప్పుడూ స్పెష‌లే.. ‘దేవర’ మూవీ అంద‌రికీ క‌న్నుల పండుగ‌లా ఉంటుంది - దర్శ‌కుడు కొర‌టాల శివ‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Devara     # JrNTR     # JanhviKapoor     # KoratalaSiva