'దేవర'కు స్టీల్‌ ప్లాంట్‌ సెగ!

'దేవర'కు స్టీల్‌ ప్లాంట్‌ సెగ!

2 months ago | 5 Views

ఏపీలో 'దేవర’ సినిమాకు మరో చిక్కు ఎదురైంది. అదేంటంటే.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 'దేవర’ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. 'దేవర’ సినిమా పోస్టర్లపై 'సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌’ నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నేతలు అతికించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది.


దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ 'దేవర’ సినిమాకు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సెగ తాకింది. విశాఖపట్నంలో చాలా చోట్ల 'దేవర’ సినిమా పోస్టర్లపై ’సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదాలతో ఉన్న పోస్టర్లు వెలిశాయి. మరి ఈ పోస్టర్ల వ్యవహారంపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందిస్తాడా? విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ మద్దతు ఇస్తాడా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.

ఇంకా చదవండి: కొత్త సినిమాల విడుదలలో నయా ట్రెండ్‌.. అధికారికంగా బ్లాక్‌ టిక్కెట్ల దందా!?

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Devara     # Janhvikapoor     # Saifalikhan     # September27