పెద్దమ్మతల్లిని దర్శించుకున్న స్టార్ నటుడు శివరాజ్‌కుమార్
3 days ago | 5 Views
కన్నడ చక్రవర్తి, స్టార్ నటుడు శివరాజ్ కుమార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నాడు. తన సతీమణితో కలిసి పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న శివరాజ్‌కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇక శివరాజ్ కుమార్‌ని చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకున్న శివన్న మళ్లీ సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్‌సీ 16’ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా.. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్ ఇందులో కథనాయికగా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇంకా చదవండి: నిహారిక పాదాలకు ఏమైంది..? : నిహారిక పోస్ట్ చూసిన నెటిజన్ల ప్రశ్నలు
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"