'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'లో శ్రీలీల సందడి!
1 day ago | 5 Views
టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'. సీజన్ 4లో ప్రతీ ఎపిసోడ్‌కు ఎంటర్‌టైన్ మెంట్ డోస్ పెంచుతూ వెళ్తున్నాడు. ఇప్పటివకే పలువురు సెలబ్రిటీలు సందడి చేయగా.. తాజాగా శ్రీలీల, నవీన్ పొలిశెట్టితో కొత్త ఎపిసోడ్ చేసింది బాలకృష్ణ టీం. ఎపిసోడ్ 6 ప్రోమోను విడుదల చేశారు.
మీరు ఎమ్మెల్యే..నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్.. అంటూ ఫన్ టైమింగ్ కామెడీతో షురూ అయింది ప్రోమో.రియల్ లైఫ్‌లో చిట్టీ దొరికిందా..? అని నవీన్ పొలిశెట్టి అడిగాడు బాలకృష్ణ. డేట్‌కు వెళ్దామన్నామనుకో ఏ యాక్టర్‌ను తీసుకొని వెళ్తామని అడిగితే.. మనం ఇప్పటికే డేట్‌లో ఉన్నామంటున్నాడు నవీన్ పొలిశెట్టి. బాలయ్యతో శ్రీలీల, నవీన్ పొలిశెట్టి సరదా చిట్‌చాట్, ఆటపాటతో సాగుతున్న సీజన్ 4 ఎపిసోడ్ 6 ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న విడుదల కానుంది. ఇప్పటికే ఈ షోలో ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడు, మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కోలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారని తెలిసిందే.
ఇంకా చదవండి: హైదరాబాద్ నడిబొడ్డున 'పుష్ప' వైల్డ్ ఫైర్ జాతర!