'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'లో శ్రీలీల!
1 month ago | 5 Views
టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'. బాలకృష్ణ సీజన్ 4లో ఎంటర్‌టైన్ మెంట్ డోస్ పెంచుతూ కొత్త కొత్త సెలబ్రిటీలతో సందడి చేస్తున్నాడు. ఇటీవలే పుష్ప 2 ది రూల్ ప్రమోషన్స్‌లో భాగంగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో బాలకృష్ణతో సందడి చేశాడని తెలిసిందే. ఈ ఎపిసోడ్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. భగవంత్ కేసరిలో బాలకృష్ణతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోకు మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా బాలయ్య, శ్రీలీల మరోసారి సందడి చేయబోతున్నారన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. తాజాగా మరో అతిథిగా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలను ఫైనల్ చేశారు మేకర్స్.
శ్రీలీల అన్‌స్టాపబుల్ తాజా ఎపిసోడ్ షూట్‌లో జాయిన్ అయింది. స్లీవ్ లెస్ టాప్, చీరకట్టులో క్యారవాన్ ముందు హొయలు పోతున్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ శ్రీలీల ఎపిసోడ్ ప్రోమో ఎప్పుడొస్తుందనేది తెలియాల్సి ఉంది. అన్‌స్టాపబుల్ షోలో శ్రీలీల తర్వాత రాబోయే గెస్ట్ నవీన్ పొలిశెట్టి అని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఇంకా చదవండి: సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# అన్‌స్టాపబుల్‌విత్‌ఎన్‌బీకే # బాలకృష్ణ # శ్రీలీల # నవీన్‌పొలిశెట్టి