రష్మిక కోసమే స్పెషల్‌ సాంగ్‌!

రష్మిక కోసమే స్పెషల్‌ సాంగ్‌!

3 days ago | 5 Views

నేను గైడ్‌ చేస్తా.. నేను గైడ్‌ చేస్తా అంటూ కళ్లముందు సూపర్‌ సక్సెస్‌ ఊరిస్తుంటే, ఎవరైనా వద్దంటారా? చూసీ చూడనట్టు ఊరుకుంటారా? నేర్చుకోవడానికి.. ఫాలో కావడానికి నేను రెడీ అంటూ ముందడుగేస్తారా? మిగిలిన వాళ్ల సంగతేమోగానీ... మురుగదాస్‌ మాత్రం ఈ విషయంలో ఒన్‌ స్టెప్‌ ఫార్వర్డ్‌ ఉన్నట్టే అనిపిస్తోంది. ఇంతకీ ఆయన ఏం చేశారు? అదీ సంగతి. రష్మికలో డ్యాన్సింగ్‌ టాలెంట్‌ ఇంత ఉందా? అని ఏ సినిమాకు ఆ సినిమా.. ఏ పాటకు ఆ పాట ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. సరిగ్గా దాన్నే అర్థం చేసుకున్నారు మురుగదాస్‌. ఇప్పుడు తాను చేస్తున్న 'సికందర్‌'లోనూ ఆ విషయాన్నే హైలైట్‌ చేసేయాలని ఫిక్సయ్యారు. కెమెరా ముందు రష్మిక ఉంటే.. అటూ ఇటూ చూడటం ఎందుకనుకున్నారేమో.. ఆమె మీద సాంగ్స్‌ గట్టిగానే ప్లాన్‌ చేశారు. మామూలుగానే బాలీవుడ్‌లో పాటల చిత్రీకరణ గ్రాండ్‌గా ఉంటుంది.

SSMB28: Rashmika Mandanna demands huge remuneration for special song -  Sakshi

అందులోనూ ఇప్పుడు 'సికందర్‌' విషయంలో మరింత ప్రెస్టీజియస్‌గానే తీసుకున్నారనే విషయం ఇట్టే అర్థమైపోతోంది. ఈద్‌ కానుకగా 'సికందర్‌'ని రిలీజ్‌ చేస్తున్నారు మురుగదాస్‌. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రష్మిక ఈ 'సికందర్‌'లో ఎలా కనిపిస్తారో, ఎంత మెస్మరైజ్‌ చేస్తారో చూడ్డానికి ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు నేషనల్‌ క్రష్‌ ఫ్యాన్స్‌.
ఇంకా చదవండి: టాలీవుడ్‌పై ఆశలు పెట్టుకున్న అవికాగోర్‌!

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సికందర్‌     # రష్మిక