బాలీవుడ్ నుంచి శోభితకు ప్రత్యేక సాంగ్ ఆఫర్..అంగీకరిస్తుందా ..అన్న చర్చ!?
3 months ago | 56 Views
మరో కొద్ది రోజుల్లో బాలీవుడ్ బ్యూటీ, తెలుగు సోయగం శోభిత దూళిపాళ్ల అక్కినేని వారి ఇంట అడుగుపెట్టబోతున్నది.ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్న నాగ చైతన్య, శోభిత జంట మరో రెండు మూడు నెలల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తమ సినిమా షూటింగ్‌లను కానిచ్చేస్తున్నారు. నాగ చైతన్య 'తండేల్' సినిమా షూటింగ్ బిజీగా ఉండగా శోభిత 'సితార' అనే ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా శోభితకు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఓ బంఫరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. షారుఖ్‌ఖాన్, రణ్ వీర్ సింగ్ వంటి ఆగ్ర హీరోలు నటిస్తున్న 'డాన్-3' సినిమాలో ఓ ప్రత్యేక పాట కోసం మూవీ మేకర్స్ శోభితను సంప్రదించినట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది ఈ విషయమై ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. అయితే శోభిత ఇప్పటి వరకు తన సినీ కెరీర్‌లో ఒక్క ఐటెం సాంగ్ కూడా చేయలేదు. ఈమధ్యే నాగ చైతన్యతో పెళ్లికి సిద్ధమైన శోభిత మరి ఈ ఐటం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, ఇస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి కొద్ది రోజుల్లో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉండగా గతంలో నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత అక్కినేని ఫ్యామిలీ ఆమె కెరీర్ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వగా.. నాగ చైతన్య సమంతను బాగా ప్రోత్సహించాడు. ఆ క్రమంలో సమంత ఒకటి రెండు బోల్డ్ రోల్స్ చేసింది. దీంతో అవే వారి మధ్య
విభేదాలకు కారణమనే ప్రచారం కూడా నడిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ వారి విడాకులకు ప్రధాన కారణమన్న వార్తలు కూడా అప్పట్లో బాగా హల్‌చల్ చేశాయి. అదే నిజమన్నట్లుగా చైతన్యతో కలిసి విడాకుల ప్రకటన జరిగిన నెలలోపే 'పుష్ప' సినిమాలో సమంత గాటు ఐటైం సాంగ్ కూడా చేసింది. అదంతా ఇప్పుడు గతం అనుకుంటే కొద్దిరోజుల క్రితమే నాగచైతన్య ,శోభిత ల ఎంగేజ్మెంట్ జరగగా రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లానింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం. మరి ఈ పెళ్లయ్యాక అక్కినేని ఫ్యామిలీ సమంతకు ఇచ్చినట్టుగానే శోభిత సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటారా అనేది వంద డాలర్ల ప్రశ్నలా ఉంది. ఎదయితే సమంత చైతన్య విడాకుల విషయంలో ప్రముఖంగా వినిపించిన బోల్డ్ రోల్స్‌ను శోభితా తన కెరీర్ ముందు నుంచి పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. మరి ఇప్పుడు దర్శకుడు ఫరాన్ అక్తర్ 'డాన్ 3' సినిమాలో ఐటం సాంగ్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. మరీ ఈ ఛాన్స్ ను శోభితా ఉపయోగించుకుంటుందా.. శోభితకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభిస్తుందా అనే ఆసక్తికరమైన చర్చ సోషల్ విూడియాలో తెగ నడుస్తొంది.
ఇంకా చదవండి: మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు : ఓ ఇంటర్వ్యూలో నటుడు అవిూర్ ఖాన్
# SobhitaDhulipala # NagaChaitanya # Bollywood