సితార పుట్టిన రోజు...మహేశ్‌ స్పెషల్‌ వీడియో!

సితార పుట్టిన రోజు...మహేశ్‌ స్పెషల్‌ వీడియో!

5 months ago | 72 Views

శనివారం మహేశ్‌బాబు గారాలపట్టీ సితార పుట్టినరోజు .ఈ సందర్భంగా  తన కుమార్తెకు ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు సూపర్‌స్టార్‌. సోషల్‌ విూడియా వేదికగా సితార ఫొటో షేర్‌ చేసిన ఆయన ’హ్యాపీ 12 మై సన్‌షైన్‌’ అని పేర్కొన్నారు. మరోవైపు, నమ్రత సైతం ఇన్‌స్టా వేదికగా స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. సితార చిన్నప్పటి ఫొటోలు వీడియోలు కలిపి ఓ వీడియో క్రియేట్‌ చేశారు. ‘నా చిట్టి ప్రయాణ సహచరురాలికి జన్మదిన శుభాకాంక్షలు.

వివిధ దేశాలు లెక్కలేనన్ని జ్ఞాపకాలు నువ్వు ఎల్లప్పుడూ నాకొక ట్రావెల్‌ గైడ్‌లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా. ఐ లవ్‌ యూ మై స్వీట్‌హార్ట్‌‘ అని క్యాప్షన్‌ ఇచ్చారు నమ్రత. ఈ పోస్ట్‌కు స్పందించి పలువురు నెటిజన్లు సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే సితార సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు సితార. గత ఏడాది తర పుట్టినరోజు పలువరు విద్యార్థినీలకు సైకిళ్లు బహుమతిగా ఇచ్చింది.

ఇటీవల ఓ నగల దుకాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆ ప్రకటన ద్వారా తాను అందుకున్న పారితోషికాన్ని సేవల కోసం వినియోగించారు. భవిష్యత్తుల్లో నటిని అవుతానని, మంచి అవకాశం వస్తే తప్పకుండా ఆ యాక్ట్‌ చేస్తానని ఇప్పటికే వెల్లడించారు. అందుకే డాన్స్‌ కూడా నేర్చుకుంటోంది.

ఇంకా చదవండి: ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డుల్లో 'బలగం' సినిమా సత్తా!

# Sitara Ghattamaneni     # Mahesh Babu     # Birthday    

trending

View More