గాయని సుశీల కోలుకుంది.. ఆరోగ్యాంగా ఇంటికి చేరుకుంది!
4 months ago | 33 Views
ప్రముఖ గాయని, పద్మభూషణ్ పురస్కార గ్రహీత పి.సుశీల పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. తాను క్షేమంగా ఉన్నానంటూ అభిమానుల కోసం తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. రెండురోజుల క్రితం ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స తీసుకున్న సుశీల క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ వీడియో షేర్ చేశారు. ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు. అభిమానుల ప్రార్థనలే నన్ను రక్షించాయి. దేవుడిన నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు. నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు. విూ అందరికీ నా కృతజ్ఞతలు. విూరందరూ ఎప్పుడూ చల్లగా ఉండాలి.’ అని ఆమె కోరుకున్నారు. అలాగే కావేరి ఆస్పత్రిలో ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని సిబ్బందికి, వైద్య బృందానికి వారికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు, తమిళంతోపాటు పదికిపైగా భాషల్లో 45 వేలకు పైగా పాటలు పాడిన సుశీల కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇంకా చదవండి: 'ఓజి'లో భాగస్వామ్యం కావడం అదృష్టం: ప్రియాంక అరుల్ మోహన్
# Susheela # Family # Socialmedia