విజయ్‌తో మరోసారి నటించనున్న శృతిహసన్‌

విజయ్‌తో మరోసారి నటించనున్న శృతిహసన్‌

1 month ago | 5 Views

అగ్రహీరో విజయ్‌ నటిస్తున్న 69వ చిత్రంలో హీరోయిన్‌ శృతిహాసన్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో విజయ్‌ సరసన ‘పులి’ సినిమాలో శృతి హీరోయిన్‌గా నటించారు. సుదీర్ఘకాలం తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించబోతున్నారు.

Vijay Thalapathy Last Film - Thalapathy Vijay, Shruti Haasan to reunite for  one last time in Jana Nayagan - India Today

ప్రస్తుతం రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమాలో శృతి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. రజనీకాంత్‌, శృతిహాసన్‌ ఇటీవలే థాయ్‌ నుంచి చెన్నై తిరిగి వచ్చారు. అదే సమయంలో విజయ్‌ 69వ చిత్రం ‘జన నాయగన్‌’ షూటింగ్‌ నగర శివారు ప్రాంతమైన పనైయూరులో జరుగుతుంది. ఈ షూటింగ్‌లో శృతిహాసన్‌ పాల్గొన్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో బాబీ డియోల్‌, మమితా బైజు, గౌతం వాసుదేవ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌, వరలక్ష్మి, డీజే అరుణాచలం తదితరులు నటిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందే ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన హీరో విజయ్‌ నటించే చివరి చిత్రం ఇదేనంటూ ప్రచారం సాగుతున్న విషయం తెల్సిందే.
ఇంకా చదవండి: పిచ్చెక్కించిన ఎన్టీఆర్‌... 'వీడీ' చిత్రానికి కి వాయిస్‌ ఓవర్‌తో ప్రాణం!

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# రజనీకాంత్‌     # విజయ్‌    

trending

View More