స్పెషల్‌ సాంగ్‌లో శ్రియా శరణ్‌!

స్పెషల్‌ సాంగ్‌లో శ్రియా శరణ్‌!

3 months ago | 39 Views

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య  ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్‌ కాంపౌండ్‌ నుంచి ఇప్పటికే కంగువ విడుదలకు ముస్తాబుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే సూర్య 44 కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు సూర్య. స్టార్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి షెడ్యూల్‌లో భాగంగా అండమాన్‌ లోని పోర్ట్‌ ª`లబెయిర్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌తోపాటు సూర్య, పూజాహెగ్డేపై వచ్చే సాంగ్స్‌ను చిత్రీకరించి నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.

ఈ మూవీలో సీనియర్‌ హీరోయిన్‌ శ్రియా శరణ్‌ స్పెషల్‌ సాంగ్‌లో మెరువనుంది. ఊటీ షెడ్యూల్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నారట మేకర్స్‌. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ఇడుక్కి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో పాపులర్‌ మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ అందిస్తున్నాడు. పీరియాడిక్‌ వార్‌ అండ్‌ లవ్‌ నేపథ్యంలో వస్తోన్న సూర్య 44కు తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్‌ డీవోపీగా పనిచేస్తున్నాడు. సూర్య హోంబ్యానర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్‌ 2025 పొంగళ్‌ కానుకగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.

ఇంకా చదవండి: అల్లు అర్జున్‌గారు, ఎన్టీఆర్‌గారు.. ‘ఆయ్’లో నా పెర్ఫామెన్స్ చూసి అభినందించారు: న‌య‌న్ సారిక‌

# Suriya     # Shriyasaran     # Kollywood    

trending

View More