'పుష్పా2'లో  శ్రద్ధా కపూర్ ఐటమ్‌ సాంగ్‌ ?

'పుష్పా2'లో శ్రద్ధా కపూర్ ఐటమ్‌ సాంగ్‌ ?

2 months ago | 5 Views

టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు సుకుమార్‌ సినిమాలలో స్పెషల్‌ సాంగ్‌లు ఎంత ఫేమస్‌ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మొదటి సినిమా 'ఆర్య'లో మొదలైన ఈ సెంటిమెంట్‌ 'నాన్నకు ప్రేమతో..' సినిమాలో తప్ప ప్రతి సినిమాలో కొనసాగుతుంది. అ అంటే అమలాపురం, 36-24-36, రింగ రింగా, డియాలో డియాలా, జిగేల్‌ రాణి, లండన్‌ బాబు, ఊ అంటావా మావ.. సాంగ్‌లతో ప్రేక్షకులకు అలరించాడు.

అయితే ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'పుష్ప ది రూల్‌' ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది. రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌కు సంబంధించి ఒక సాలిడ్‌ న్యూస్‌ సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్ ఐటం సాంగ్‌ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే 'స్త్రీ '2 సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది ఈ భామ. అయితే పుష్పకి ఉన్న క్రేజ్‌కి  శ్రద్ధా కపూర్  అయితేనే సరిగ్గా సరిపోతుందని అందుకనే స్త్రీ భామను ఇందులో తీసుకుబోతున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి: వరుస విజయాలతో అగ్రభాగాన ప్రభాస్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# పుష్పా2     # అల్లు అర్జున్‌     # శ్రద్ధా కపూర్    

trending

View More