నితిన్‌ భార్య కోసం షూటింగ్‌కు సెలవు!

నితిన్‌ భార్య కోసం షూటింగ్‌కు సెలవు!

3 months ago | 41 Views

యంగ్‌ హీరో నితిన్‌ సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. చివరిగా నితిన్‌ 'మాచర్ల నియోజకవర్గం' మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్‌  అయ్యింది. కమర్షియల్‌ యాక్షన్‌ జోనర్‌ లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని నిరాశ పరిచింది. నితిన్‌ చివరిగా భీష్మ మూవీతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఆ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చింది. మరల ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ రాబిన్‌ హుడ్‌ అనే మూవీ చేస్తున్నాడు. ఇది కూడా కామెడీ అండ్‌ యాక్షన్‌ ఎంటర్ టైనర్ గానే ఉండబోతోంది. శ్రీలీల ఈ చిత్రంలో నితిన్‌ కి జోడీగా నటిస్తోంది. దీంతో పాటుగా దిల్‌ రాజు బ్యానర్‌ లో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'తమ్ముడు' మూవీ నితిన్‌ చేస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. మారేడుమిల్లిలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారంట. కాంతారా ఫేమ్‌ సప్తమి గౌడ ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే నితిన్‌ ఇప్పుడు ఈ సినిమాల షూటింగ్స్‌ నుంచి రెండు నెలలు బ్రేక్‌ తీసుకోవాలని అనుకుంటున్నారట. నితిన్‌ 2020లో షాలిని కందుకూరిని వివాహం చేసుకున్నారు. ఇద్దరిది ప్రేమ వివాహం. ఇద్దరు కూడా ప్రస్తుతం హ్యాపీ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నారు. కొంతకాలం క్రితం షాలిని గర్భవతి అయ్యిందంట. ఆమెకి సెప్టెంబర్‌ లో డెలివరీ డేట్‌ ఇచ్చారట. దీంతో రెండు నెలల పాటు భార్యతో స్పెండ్‌ చేసేందుకు నితిన్‌ షూటింగ్స్‌ కి బ్రేక్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట. రాబిన్‌ హుడ్‌ సినిమాని డిసెంబర్‌ 20న రిలీజ్‌ చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. తమ్ముడు మూవీని కూడా వీలైనంత వేగంగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి రెండు నెలల పాటు షూటింగ్స్‌ కి నితిన్‌ బ్రేక్‌ ఇస్తే అనుకున్న ప్రకారం వాటిని రిలీజ్‌ చేయడం కుదురుతుందా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. తమ్ముడు సినిమా షూటింగ్‌ ఆల్‌ మోస్ట్‌ చివరి దశకి వచ్చేసిందని టాక్‌ వినిపిస్తోంది. రాబిన్‌ హుడ్‌ మూవీని ఈ ఏడాదిలో రిలీజ్‌ చేయడం కష్టం కావచ్చేమో అనే ప్రచారం నడుస్తోంది. డిసెంబర్‌ లో దిల్‌ రాజు ప్రొడక్షన్‌ నుంచి గేమ్‌ చేంజర్‌ ప్రేక్షకుల ముందుకి రానున్న నేపథ్యంలో తమ్ముడు చిత్రాన్ని వచ్చే ఏడాదిలోనే ప్లాన్‌ చేసే ఛాన్స్‌ ఉందని టాలీవుడ్‌ వర్గాలలో వినిపిస్తోంది.

ఇంకా చదవండి: రాజమౌళితో సినిమా చేయాలనుంది: నటుడు విక్రమ్‌ వెల్లడి

# Nithiin     # ShaliniKandukuri    

trending

View More