'దేవర-2'  కోసం శివకు సెలవిచ్చా: ఎన్టీఆర్‌ ఆసక్తికర విషయాలు వెల్లడి

'దేవర-2' కోసం శివకు సెలవిచ్చా: ఎన్టీఆర్‌ ఆసక్తికర విషయాలు వెల్లడి

2 months ago | 5 Views

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'దేవర’ మంచి విజయం సాధించి అభిమానుల్లో జోష్‌ నింపింది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్న విషయం తెలిసిందే. మొదటి భాగం హిట్‌ కావడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఆంగ్ల విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్‌ 'దేవర2’ గురించి మాట్లాడారు. 'దేవర’ సీక్వెల్‌ ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్‌2లో కొన్ని సన్నివేశాలు షూట్‌ చేశాం. ఫస్ట్‌ పార్ట్‌ మంచి విజయం సాధించడంతో మా బాధ్యత మరింత పెరిగింది.'దేవర’ కంటే దాని సీక్వెల్‌ ఇంకా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం.


ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. దానికి మెరుగులు దిద్దాలి. కొరటాల శివ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఏవిూ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్‌ చేసి రమ్మన్నాను. ఆ హాలీడేస్‌ నుంచి వచ్చాక దీని పనులు ప్రారంభిస్తాం‘ అని చెప్పారు. లాస్‌ ఏంజెలెస్‌ తనకు మరో హోంటౌన్‌ అని ఎన్టీఆర్‌ చెప్పారు.'ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత ఆ ప్రాంతం తన మనసుకు దగ్గరైందన్నారు. 'దేవర’ విడుదల సమయంలో తాను విదేశాల్లో ఉన్నట్లు చెప్పారు. 24 ఏళ్ల సినీ కెరీర్‌లో తన సినిమా రిలీజ్‌ రోజు ఇంట్లో లేకుండా ఉండడం మొదటిసారి అని తెలిపారు. ఇక ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే రికార్డులు సొంతం చేసుకున్న 'దేవర’ విడుదల తర్వాత కూడా అదే జోష్‌ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు రూ.405 కోట్లు వసూలు చేసింది.

ఇంకా చదవండి: 35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, RGV ల 'శివ'

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Devara     # JrNtr     # SaifAliKhan     # PrakashRaj     # JanhviKapoor     # OTT