
ఈడీ తీరుపై మండిపడ్డ దర్శకుడు శంకర్ .. ఆస్తుల అటాచ్‌మెంట్ అక్రమమని వెల్లడి
1 month ago | 5 Views
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ’ఎంథిరన్’ సినిమాకు సంబంధించి నమోదైన కాపీరైట్ ఉల్లంఘన కేసులో శంకర్‌కు చెందిన దాదాపు రూ.10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేయడంపై ఆయన మౌనం వీడారు. ఈడీ చర్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. కోర్టు తీర్పును పక్కనపెట్టి ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడటం తనని ఎంతగానో బాధించిందని ఆయన పేర్కొన్నారు. చెన్నై జోనల్ కార్యాలయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న చర్యలను ఉద్దేశించి పలు విషయాలను ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ’ఎంథిరన్’ చిత్రానికి సంబంధించి నిరాధారమైన ఆరోపణలను ఆధారంగా చూపించి నాకు సంబంధించిన మూడు స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేశారు. ఈ చర్య న్యాయపరమైన వాస్తవాలను తప్పుదోవ పట్టించడమే కాకుండా చట్ట పక్రియ దుర్వినియోగాన్ని సూచిస్తుంది. ’ఎంథిరన్’ కాపీరైట్ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు క్షుణ్ణంగా విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్ష్యాధారాలు, ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ’ఎంథిరన్’ చిత్రానికి సంబంధించిన అసలైన హక్కులు తనకే ఉన్నాయంటూ అరూర్ తమిళనాథన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ కేసుపై ఇప్పటికే న్యాయస్థానం తీర్పునిచ్చినప్పటికీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ఈవిధంగా ఈడీ నా ఆస్తులను అటాచ్ చేసింది. కాపీరైట్ ఉల్లంఘన అనేది జరగలేదని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి ఇలా చర్యలు తీసుకోవడం నన్నెంతో బాధించింది‘ అని ఆయన పేర్కొన్నారు. తన కథ ’జిగుబా’ను కాపీ కొట్టి శంకర్ ’ఎంథిరన్’ సినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ఈ కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక కూడా శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని తెలిపింది. శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఆ వివరాల ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది.
ఇంకా చదవండి: 'హిచ్‌కాక్' రెండో ఎడిసన్ ప్రారంభించిన చిరు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఎంథిరన్ # శంకర్