'వార్‌-2'లో  షారూఖ్‌ !?

'వార్‌-2'లో షారూఖ్‌ !?

3 days ago | 5 Views

మంచి కథ అయితే చాలు ఏ భాష సినిమానైనా  ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దానికి తగట్టే హీరోలు కూడా కథలు, కాంబినేషన్‌లు ఎంపిక చేసుకుంటున్నారు. మల్టీస్టారర్‌కు కొత్త డెఫినేషన్‌ ఇస్తున్నారు. టాలీవుడ్‌ హీరో బాలీవుడ్‌ స్టార్‌తో కలిసి సినిమా చేయడం, దానికి పాన్‌ ఇండియా ఇమేజ్‌ రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మల్టీస్టారర్స్‌లో కూడా కొన్ని కాంబోలు 'అబ్బా ఏం కాంబినేషన్‌రా అనిపిస్తాయి. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా  అవుతుంటాయి. అలాంటి కలయికే ఎన్టీఆర్‌ - హృతిక్‌ రోషన్‌  కాంబో. వీరిద్దరూ కలిసి 'వార్‌- 2’లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 'దేవర’ తరవాత ఈ సినిమా కోసం కాల్షీట్లు కేటాయించాడు  తారక్‌. కొన్నాళ్ల క్రితం 'వార్‌-2’కి సంబంధించిన కొంత చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు మరో షెడ్యూల్‌ మొదలైంది. ఎన్టీఆర్‌, హృతిక్‌ లపై యాక్షన్‌ దృశ్యాలతోపాటు ఓ పాటను తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ సినిమాలో షారుక్‌ ఖాన్‌ కూడా నటించబోతున్నాడని ముంబై విూడియా చెబుతోంది.  ఇందులో షారుఖ్‌  ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ లో కనిపిస్తారని, 'పఠాన్‌’ సినిమాలో కనిపించిన లుక్‌లో ఉంటారని టాక్‌. అంతేకాదు.. ఎన్టీఆర్‌, హృతిక్‌, షారుఖ్‌ ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. అదే నిజమైతే థియేటర్లో అభిమానులకు పూనకాలే. షారుక్‌కు గెస్ట్‌ రోల్‌ లో ఎంట్రీ ఇవ్వడం, తన అభిమానుల్ని అలరించడం బాగా సరదా. అందులో భాగంగానే ఈ గెస్ట్‌ రోల్‌ కు ఓకే చేశాడని తెలుస్తోంది. ఆయన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# వార్‌-2     # ఎన్టీఆర్‌     # హృతిక్‌ రోషన్‌     # షారుఖ్ ఖాన్