చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులు... విూడియా అతిగా చేస్తోందని మండిపడ్డ సురేశ్ గోపి!
2 months ago | 29 Views
నటులు, దర్శకుల నుంచి మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని హేమ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి సురేశ్ గోపీ స్పందించారు. ఈ అంశంపై విూడియా చేస్తున్న ప్రచారంపైనా ఆయన మండిపడ్డారు. చిత్ర పరిశ్రమపై ప్రజల అభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తోందంటూ విూడియా తీరుపై మండిపడ్డారు.
చిత్రసీమలో వస్తున్న లైంగిక ఆరోపణలు గురించి విూడియా చేస్తున్న ప్రచారం ప్రజల అభిప్రాయాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. ఈ ఆరోపణలే విూడియాకు ఆహారం పెడుతున్నాయి. విూరు డబ్బు సంపాదించేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నారని అర్థమవుతోంది. అయితే.. వాస్తవాలు ఏంటో తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని సురేశ్ గోపీ విూడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. విూ స్వలాభాల కోసం అలజడి సృష్టించేందుకు ప్రయత్నించడమే కాకుండా.. వారి అభిప్రాయాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. విూరు న్యాయస్థానం కంటే గొప్పకాదు. ఈ సమస్య కోర్టు పరిధిలో ఉంది. నిజానిజాలు తెలుస్తాయి. అంతవరకు వేచి ఉండండి. న్యాయస్థానాన్ని ఓ నిర్ణయం తీసుకోనివ్వండని పేర్కొన్నారు. కాగా.. 2017లో నటిపై దాడి జరిగిందంటూ కేసు నమోదైంది. దీనిపై సమగ్ర నివేదిక కోసం కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై కమిటీ ఇచ్చిన నివేదికపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ నటి రేవతి సంపత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు, కేరళ స్టేట్ చలచిత్ర అకాడవిూ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని బెంగాలీ నటి శ్రీలేఖ కూడా ఆరోపించడం సంచలనం రేపుతోంది. దీనిపై విూడియాలో వస్తున్న కథనాలపై తాజాగా స్పందించిన కేంద్రమంత్రి సురేశ్ గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా చదవండి: బెంగాల్లోనూ కాస్ట్ కౌచింగ్... దర్యాప్తు చేపట్టాలన్న బెంగాలీ నటి రితాభరీ చక్రవర్తి
# SureshGopi # Hemacommittee # Ranjith