అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ కు డూప్‌గా ఏడడుగుల సునీల్‌ కుమార్‌!

అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ కు డూప్‌గా ఏడడుగుల సునీల్‌ కుమార్‌!

3 months ago | 51 Views

'కల్కి 2898 ఎడి’ చిత్రంలో ఏడడుగుల అశ్వత్థామపాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. అమితాబ్‌ బచ్చన్‌ ఆ పాత్రలో ఎంతగానో  ఒదిగిపోయారు. ద్వాపర యుగం నాటి పాత్ర కాబట్టి సినిమాలో మిగిలిన అన్ని పాత్రలు ఇప్పటి ఎత్తులో ఉన్నా అమితాబ్‌ ఏడడుగుల ఎత్తులో కనిపిస్తారు. ఆ పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదంతా గ్రాఫిక్‌ మాయాజాలం అనుకున్నారంతా. కానీ నిజంగానే అంత ఎత్తున్న ఆర్టిస్ట్‌ ఆ పాత్రను పోషించారు. అంటే అమితాబ్‌ బచ్చన్‌కు డూప్‌గా చేశారు. ఇందులో అమితాబచ్చన్‌కి డూప్‌గా జమ్మూ కశ్మీర్‌కు చెందిన సునీల్‌ కుమారం ఎత్తు ఏడు అడుగుల ఏడు అంగుళాలు. జమ్మూలోని పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తున్నాడు.  సినిమాలపై ఉన్న ఆసక్తితో ప్రయత్నాలు చేశారు.

'కల్కి' సినిమాతోపాటు పలు హిందీ సినిమాల్లో అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం వరుసగా చిత్రాల్లో నటిస్తున్న సునీల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'కల్కి’ చిత్రీకరణ అనుభవాలను పంచుకున్నాడు. 'చిన్నప్పటి నుంచి నేను అమితాబ్‌ సర్‌ ఫ్యాన్‌. నేను మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులు మొత్తం అమితాబ్‌ జీ ఫాన్సే. అలాంటి అమిత్‌ జీ కి డూప్‌గా నటించాలి అన్నప్పుడు సర్‌ప్రైజ్‌ అయ్యాను. 'కల్కి' సినిమా సెట్స్‌లో మొదటి రోజు అడుగు పెట్టిన విషయం ఎప్పటికీ  మరచి పోలేను. ప్రభాస్‌, అమితాబ్‌ గారు కలిసి కూర్చుని ఉన్నారు. నన్ను చూడగానే నా వద్దకు వచ్చి మాట్లాడారు. ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. 'కల్కి' సినిమా కోసం పలు యాక్షన్‌ సన్నివేశాల్లో నేను నటించాను. చాలా రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కిందని చెప్పారు. షూటింగ్‌ కోసం సెలవు పెట్టి ముంబై, హైదరాబాద్‌ తిరగాలంటే సెలవులు కొంచెం కష్టమైనా సినిమాల్లో నటించడం బాగానే ఉంది అని సంతోషపడుతున్నారు సునీల్‌కుమార్‌.

ఇంకా చదవండి: తారక రామారావుతో తెలుగమ్మాయి జోడీ!

# AmitabhBachchan     # Kalki2898AD     # SunilKumar    

trending

View More