లవ్ కు బ్రేకప్‌ చెప్పేశా: నటి మృణాళ్‌ ఠాకూర్‌ వెల్లడి!

లవ్ కు బ్రేకప్‌ చెప్పేశా: నటి మృణాళ్‌ ఠాకూర్‌ వెల్లడి!

3 months ago | 40 Views

ఈ మధ్యకాలంలో ఇష్టపడిన వ్యక్తితో ప్రేమ, కొంతకాలానికి బ్రేకప్‌ సినీ సెలబ్రిటీల విషయంలోనూ ఇలాంటివి చూస్తూనే ఉంటాం. తాజాగా 'సీతారామం’ ఫేం మృణాల్‌ ఠాకుర్‌కు కూడా బ్రేకప్‌ అయిందట. ఏడు నెలల క్రితం బ్రేకప్‌ జరిగిన విషయాన్ని తాజాగా రివీల్‌ చేసింది. ఇటీవల ఆమె ఓ పాడ్‌ కాస్ట్‌లో మాట్లాడుతూ తన లవ్‌ స్టోరీస్‌ గురించి చెప్పింది. ఒక వ్యక్తి జీవితంలోకి సరైన వ్యక్తి భాగస్వామిగా రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోపు జీవితంలోకి వచ్చివెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. ఫైనల్‌గా మనకు ఎవరు సూట్‌ అవుతారనేది మనకే తెలుస్తుంది. ఆ విషయంలో పక్కాగా క్లారిటీ ఉండాలి. నేను గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా. కానీ నటితో డేటింగ్‌ అతడికి ఎందుకో ఇష్టం లేదు. పద్థతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు.

ఆ మాట నాకు నచ్చలేదు.  దీంతో బ్రేకప్‌ చెప్పేసుకున్నాం. ఏడు నెలల క్రితమే నాకు బ్రేకప్‌ అయింది. అయితే నన్ను చేసుకునేవాడికి లుక్స్‌ లేకపోయినా పర్లేదు కానీ మంచి మనిషి అయ్యిండాలి’ అని మృణాల్‌ ఠాకుర్‌ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు తన జీవితంలో బ్రేకప్స్‌ జరిగాయి కానీ మరీ బాధ పడిపోయేంతలా ఏం కాలేదని మృణాల్‌ చెప్పింది. మ్యూచ్‌వల్‌ అండర్‌స్టాండింగ్  తోనే విడిపోయామని పేర్కొంది. హిందీ సీరియళ్లతో కెరీర్‌ ప్రారంభించిన మృణాల్‌ 'సీతారామం’ తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ ఎంట్రీ ఇచ్చింది. 'హాయ్‌ నాన్న’, 'ఫ్యామిలీస్టార్‌’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.

ఇంకా చదవండి: తమిళనాట 'దేవర' ప్రమోషన్‌... ఓ సినిమా చేయాలంటూ వెట్రిమాన్‌ను కోరిన ఎన్టీఆర్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# MrunalThakur     # SitaRamam     # HiNanna    

trending

View More