ముఫసాలో సత్యదేవ్‌ వాయిస్‌

ముఫసాలో సత్యదేవ్‌ వాయిస్‌

5 days ago | 5 Views

హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ బ్లాక్‌ బస్టర్‌ ది లయన్‌ కింగ్‌కు ప్రీక్వెల్‌గా వస్తోంది ముఫాసా: ది లయన్‌ కింగ్‌. అకాడమీ అవార్డ్‌ విజేత బేరీ జెంకిన్స్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది. ఈ సినిమాలో వన్‌ ఆఫ్‌ కీ రోల్‌ టాకా (సింహం) పాత్రకు సత్యదేవ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించాడు. బ్రతికిపోయాం.. మనల్ని కాపాడిరది నేనే.. టాకా పాత్రకు వాయిస్‌ ఓవర్‌ అందించిన వీడియోను సత్యదేవ్‌ షేర్‌ చేశాడు.

అంతేకాదు ముఫాసా ది లయన్‌ కింగ్‌ సినిమాకు పనిచేయడం పట్ల తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో షేర్‌ చేసుకున్నాడు. నాకు లయన్‌ కింగ్‌ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ సినిమా చూసినప్పుడల్లా.. అందులో ఏదో ఒక పాత్రకు నేను వాయిస్‌ ఇవ్వాలని అనుకునేవాడిని. యానిమేషన్‌ సినిమాకు ఎప్పుడూ వాయిస్‌ ఇవ్వలేదు. కానీ తొలిసారి ఇచ్చాను. చాలా సంతోషంగా ఉంది.. అంటూ షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌లో ముఫాసా పాత్రకు టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేశ్‌ బాబు వాయిస్‌ అందించాడని తెలిసిందే. హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు బాలీవుడ్‌ యాక్టర్‌ షారుఖ్‌ ఖాన్‌ వాయిస్‌ ఓవర్‌ అందించాడు.

ఇంకా చదవండి: అమ్మతో హ్యాపీనెస్‌ మార్నింగ్‌: తల్లి నిర్మలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన అల్లు అర్జున్

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ముఫాసాదిలయన్     # సత్యదేవ్‌     # మహేశ్‌బాబు    

trending

View More