'సరిపోదా శనివారం...విూ అందరితో కలసి చూస్తా: హీరో నాని సంచలన ప్రకటన

'సరిపోదా శనివారం...విూ అందరితో కలసి చూస్తా: హీరో నాని సంచలన ప్రకటన

4 months ago | 34 Views

 నాని  హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'సరిపోదా శనివారం’ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 29న విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్‌విూట్‌ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నాని సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. అభిమానులను ఉద్దేశించి నాని మాట్లాడుతూ.. ‘మన మధ్య ఒక నమ్మకం, బంధం ఉంది. మన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే సినిమా ఇది. ఇప్పుడే చెబుతున్నా సినిమా హాళ్లు.. సినిమా హాళ్లలా ఉండవు. కాన్సర్ట్స్‌లా మారనున్నాయి. జేక్స్‌ బిజోయ్‌ మ్యూజిక్‌ అదరగొట్టేస్తున్నారు. ఈ చిత్రాన్ని విూ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సుదర్శన్‌ 35 ఎంఎంలో విూ అందరితో కలిసి సినిమా చూస్తా. నాతో సినిమా చూడ్డానికి వచ్చే ప్రతి అభిమాని చేతికి ఇలాంటి వస్త్రాన్ని కట్టుకుని రావాలి. కలుద్దాం. కలిసి సెలబ్రేట్‌ చేసుకుందాం.


24న ప్రీ రిలీజ్‌ జరగనుంది. ఆరోజు చాలా విశేషాలు చెబుతాం అని అన్నారు. అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ.. ఎస్‌.జె.సూర్య గురించి ముఖ్యంగా చెప్పాలి.'గేమ్‌ ఛేంజర్‌’ షూట్‌లో ఆయన ఎక్కువగా 'సరిపోదా శనివారం’ గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమా విశేషాలను చెబుతున్నారు. దీనికి సంబంధించిన విషయాలను నాకు తరచూ షేర్‌ చేసినందుకు ఆయనకు థాంక్స్‌ చెప్పాలి. ట్రైలర్‌ రిలీజ్‌ అయిన వెంటనే నాని, నిర్మాత దానయ్య, దర్శకుడు వివేక్‌కు కాల్‌ చేశా. 'ఎంసీఏ’, 'దసరా’ చిత్రాలను ఇది తప్పకుండా బీట్‌ చేస్తుందని నేను నమ్ముతున్నా అని తెలిపారు. గతంలో నేనొకసారి దిల్‌రాజును కలిశా. ఎలాంటి దర్శకులతో వర్క్‌ చేయాలనుకుంటున్నావు? అని ఆయన నన్ను అడిగారు. దానికి నేను వేణు మంచి దర్శకుడని.. చక్కగా సినిమాలు తెరకెక్కిస్తున్నాడని.. అలాంటివారితో వర్క్‌ చేయాలని ఉందని చెప్పా. అది మేము సరదాగా మాట్లాడుకున్నాం. కొన్ని రోజులకు అది బయటకు వచ్చింది. మా కాంబోలో తప్పకుండా సినిమా ఉంటుంది. అది ఎప్పుడు అనేది చెప్పలేనని నాని తెలిపారు.

ఇంకా చదవండి: 'పుష్పా2' పై ర్యూమర్స్‌ కంటిన్యూ...!?

# SaripodaaSanivaaram     # Nani     # PriyankaMohan     # SJSurya     # August29    

trending

View More