ఆ కామెంట్‌కు నొచ్చుకున్న సమంత!?
1 month ago | 5 Views
టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతోపాటు నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అనారోగ్య సమస్యల కారణంగా ఏడాదికాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న సామ్.. ప్రస్తుతం మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అవుతోంది. తాను నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ ప్రొమోషన్స్‌లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా తన ఇన్‌స్టా వేదికగా ఆస్క్ మీ ఎనీ థింగ్ సెషన్ నిర్వహించింది. అభిమానులతో సరదాగా కాసేపు ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
ఈ క్రమంలో ఓ నెటిజన్ సమంతను ఆసక్తికర ప్రశ్న వేశారు.కాస్త బరువు పెరగాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్లీజ్ మేడం, కాస్త బరువు పెరగండి’ అంటూ నమస్కరిస్తున్న ఎమోజీతో కామెంట్ పెట్టారు. సదరు అభిమాని రిక్వెస్ట్‌పై సమంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘మళ్ళీ బరువు గురించే ప్రశ్న. మయోసైటిస్ కారణంగా వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉన్నాను. అందువల్లే నా బరువు ఇలా ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను ఇలానే ఉండాలి. ఇతరులను జడ్డ్ చేయడం ఆపండి. మనం 2024లో ఉన్నాం. దయచేసి అవతలి వాళ్లను కూడా బతకనివ్వండి’ అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంకా చదవండి: 'గేమ్ ఛేంజర్'కు డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్!?
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# సమంత # సిటాడెల్‌హనీబన్నీ # ఇన్‌స్టాగ్రామ్