వరుణ్‌తో కలిసి స్టెప్పులేసిన సమంత!
18 days ago | 5 Views
టాలీవుడ్ స్టార్ నటి సమంత తాజాగా హిందీ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్.. హనీ బన్నీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో సామ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించారు. ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా చిత్రబృందం సిటాడెల్ సక్సెస్ పార్టీని గత రాత్రి ముంబైలో ఘనంగా నిర్వహించింది.
ఈ పార్టీలో సామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వరుణ్ ధావన్ నటిస్తున్న ‘బేబీ జాన్’ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ‘నైన్ మాటక్క’ అనే పాటకు సామ్ కాలు కదిపింది. వరుణ్ ధావన్‌తో కలిసి ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక అదే సమయంలో సక్సెస్ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా సమంత ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం అవి కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంకా చదవండి: ఎలాంటి ఉల్లంఘన జరగలేదు : నయన తరుఫున లాయర్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# సమంత # వరుణ్‌ధావన్ # సిటాడెల్‌హనీబన్నీ # అమెజాన్‌ప్రైమ్