సల్లూభాయ్‌-మురుగదాస్‌ కాంబో .. విలన్‌గా విద్యుత్‌ జమ్వాల్‌ !

సల్లూభాయ్‌-మురుగదాస్‌ కాంబో .. విలన్‌గా విద్యుత్‌ జమ్వాల్‌ !

3 months ago | 21 Views

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు ఏఆర్‌ మురుగదాస్‌  ఈ స్టార్‌ డైరెక్టర్‌ కాంపౌండ్‌ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ స్టార్‌ డైరెక్టర్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా పూర్తి చేసే కంటే ముందు మురుగదాస్‌ శివకార్తికేయన్‌తో చేస్తున్న ప్రాజెక్ట్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కానీ సల్లూభాయ్‌-మురుగదాస్‌ కాంబో సినిమాపై ఆసక్తికరవార్త నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ విద్యుత్‌ జమ్వాల్‌ విలన్‌గా కనిపించబోతున్నాడట. ఒకవేళ ఈ వార్త నిజమైతే మురుగదాస్‌-విద్యుత్‌జమ్వాల్‌ కాంబోలో 12 ఏండ్ల గ్యాప్‌ తర్వాత రాబోతున్న రెండో సినిమా కానుంది.

మరి మురుగదాస్‌-విద్యుత్‌ జమ్వాల్‌ కలయికలో రాబోతున్న సినిమా గురించి మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శాండల్‌వుడ్‌ రుక్మిణి వసంత్‌ ఈ చిత్రంలో ఫే మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. శ్రీలక్ష్మి మూవీస్‌ పై ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్‌ స్టార్‌ కంపోజర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది 'టైగర్‌ 3' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సల్లూభాయ్‌.

ఇంకా చదవండి: సినీ రచయిత రామకృష్ణ కన్నుమూత

# Salman Khan     # A.R. Murugadoss     # Vidyut Jammwal