మీడియాకు సాయిపల్లవి స్ట్రాంగ్ వార్నింగ్ !?
5 days ago | 5 Views
కథానాయిక సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రేమమ్, ఫిదా, గార్గి సినిమాలతో తనకంటూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ.. ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ అనే సినిమా చేస్తుంది. అయితే సాయి పల్లవి వెజిటేరియన్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రసావించింది. అయితే తాజాగా బాలీవుడ్ రామాయణం సినిమా కోసం సాయి పల్లవి నాన్ వెజ్ మానేస్తుందంటూ తమిళ మీడియా ఒక కథనం ప్రచురించింది. దీంతో ఈ విషయం వివాదం అవ్వగా.. దీనిపై సాయి పల్లవి స్పందిస్తూ.. మీడియాకు వార్నింగ్ ఇచ్చింది. తమిళ అగ్ర మీడియా రామాయణం సినిమా గురించి రాస్తూ..''సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లో రామాయణం అనే ప్రాజెక్ట్‌లో నటించబోతుంది. దీనికోసం షూటింగ్ ముగిసే వరకు ఎలాంటి నాన్ వెజ్ ముట్టుకోకుడదని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
అలాగే మంసాహారం తినకుండ విదేశాలకు వెళ్లినప్పుడు తనతో పాటు చెఫ్‌ను కూడా వెంట తీసుకువెళుతుంది. ఈ చెఫ్ సాయిపల్లవి కోసం వెజ్ డిన్నర్ తయారు చేస్తారు’’ అంటూ రాసుకొచ్చింది. అయితే దీనిపై ఘాటుగా స్పందించింది సాయి పల్లవి. చాలా సార్లు, దాదాపు ప్రతిసారి.. నా మీద వచ్చే పుకార్లు లేదా తప్పుడు వార్తలను పట్టించుకోను. ఈ విషయం దేవునికి కూడా తెలుసు. ముఖ్యంగా నా సినిమా రిలీజ్‌లు, అనౌన్స్‌మెంట్‌లు వచ్చినప్పుడు ఇలాంటివి ఎక్కువగా వ్యాపిస్తాయి. అయితే ప్రతిసారి ఇలా అవుతుంటే మాత్రం స్పందించక తప్పదు. నెక్స్ట్ టైం ఇలాంటి తప్పుడు వార్తలను అగ్ర మీడియాలు కానీ వాటికి చెందిన సోషల్ మీడియా పేజీలు కానీ ప్రచురిస్తే నా తరపు నుంచి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ సాయి పల్లవి రాసుకోచ్చింది.
ఇంకా చదవండి: వివాహబంధంతో ఒక్కటైన కీర్తిసురేశ్ - ఆంథోని తటిల్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సాయిపల్లవి # రామాయణం # అమరన్