అక్షరహాసన్‌తో తనూజ్‌ వీర్వాణి బ్రేకప్‌..  ప్రైవేట్‌ ఫోటోలు లీకే కారణమని పుకార్లు

అక్షరహాసన్‌తో తనూజ్‌ వీర్వాణి బ్రేకప్‌.. ప్రైవేట్‌ ఫోటోలు లీకే కారణమని పుకార్లు

3 months ago | 30 Views

కమల్‌ హాసన్‌ కుమార్తె అక్షర హాసన్‌తో నాలుగేళ్లు డేటింగ్‌లో ఉన్న తర్వాత బాలీవుడ్‌ నటుడు తనూజ్‌ వీర్వాణి ఆమెకు బ్రేకప్‌ చెప్పారు. తాజాగా వీరి బ్రేకప్‌కు గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గతంలో అక్షర హాసన్‌ ప్రైవేట్‌ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంపై స్పందించారు. బ్రేకప్‌ అయిన తర్వాత కూడా నేను అక్షరతో మాట్లాడుతూనే ఉన్నాను. ప్రేమలో ఉన్న వ్యక్తులు పరస్పరం ఒకరినొకరు గౌరవించు కోవాలి. ఒకరికోసం ఒకరు అండగా నిలబడాలి. మా ఇద్దరికీ ఆ విషయంలో విభేదాలు వచ్చాయి. అందుకే విడిపోయాం. ఆమె ప్రైవేటు ఫొటోలు లీక్‌ అయిన కారణంగా నేను బ్రేకప్‌ చెప్పలేదు. కానీ.. ఆ వివాదం తర్వాత మా ఇద్దరికీ దూరం పెరిగింది. అవి నా కారణంగా లీక్‌ అయ్యాయని ఆమె భావించింది.

అందుకే అవసరం ఉన్నప్పుడు ఆమె నాకు అండగా నిలబడలేకపోయింది. ఈ విషయంలో నేను ఆమెను నిందించాలని అనుకోవడం లేదు.. ఎందుకంటే ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయని చెప్పారు. గతంలోనూ ఈ విషయంపై తనూజ్‌  మాట్లాడారు. ’నేను అక్షర ప్రైవేటు ఫొటోలు లీక్‌ చేసినట్లు ఎన్నో పత్రికల్లో రాశారు. ఈ విషయాన్ని ఆమె ఖండిరచలేకపోయింది. వ్యక్తిగతంగా నన్ను నమ్మినప్పటికీ బయట ప్రపంచానికి మాత్రం నా తప్పులేదని ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేకపోయింది. ఆ విషయంలో ఎంతో బాధపడ్డాను. అక్షర ఫొటోలు లీక్‌ అవ్వడంపై నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని నమ్ముతున్నానని తనూజ్‌ వీర్వాణి వివరించారు.

ఇంకా చదవండి: చిత్రసీమలో మరో పెళ్లి పెటాకులు... విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి వెల్లడి

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Aksharahaasan     # Tanujveerwani     # Kamalhaasan    

trending

View More