'పుష్పా2' పై ర్యూమర్స్‌ కంటిన్యూ...!?

'పుష్పా2' పై ర్యూమర్స్‌ కంటిన్యూ...!?

4 months ago | 36 Views

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్పా-2' క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్నారు. పుష్పరాజ్‌గా మొదటిపార్ట్‌తో అల్లు అర్జున్‌ తన నటనతో, సుకుమార్‌ తన టేకింగ్‌తో ఎంతటి సెన్సేషన్‌ సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచి రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్స్‌ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. అంతేకాదు ఈ సినిమా నుంచి వదిలిన ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌కు కూడా అనూహ్య స్పందన వచ్చింది.

మొదటగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేద్డామనుకున్నారు. అయితే చిత్రీకరణ బ్యాలెన్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ పెండింగ్ గా  వుండటంతో డిసెంబర్‌ 6కు చిత్ర విడుదలను వాయిదా వేశారు. ఇక అప్పటి నుంచి ఈ చిత్రంపై పలు రూమర్స్‌ వస్తున్నాయి, అల్లు అర్జున్‌, సుకుమార్‌ల మధ్య గొడవలు, ఈ సినిమా మళ్లీ వాయిదా వేస్తారు. సమ్మర్‌కు రిలీజ్‌ చేశారు. ఇలా రకరకలా ఊహగానలు ఈ చిత్రంపై వున్నాయి. అంతేకాదు మెగాస్టార్‌ ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మనస్పర్థలు వచ్చాయని అల్లు అర్జున్‌ తన ఫ్రెండ్‌ కోసం వైసీపీ అభ్యర్థిని సపోర్ట్‌ చేయడంతో బన్నీని మెగా క్యాంప్‌ దూరం పెట్టిందని ఇలా రకరకాల ప్రచారాలు వున్నాయి. అయితే ఇవన్నీ అసత్య ప్రచారాలన్నీ పలు సార్లు మెగాస్టార్‌ కాంపౌండ్‌, అల్లు ఫ్యామిలీ వాళ్లు చెప్పినా రూమర్స్‌ ఆగడం లేదు.


ఇంకా చదవండి: ప్రభాస్‌తో సినిమాతో స్టార్‌ స్టేటస్‌.. ఇప్పుడంతా ఇమ్మాన్వీ ఇస్మాయిల్‌ కోసం సర్చ్‌!?

# Pushpa2     # Rashmikamandanna     # Alluarjun    

trending

View More