ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో సప్తసరాగాలు దాటి.. ఫేం రుక్మిణి వసంత్!
2 months ago | 5 Views
గ్లోబల్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. కాగా మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ 31 కూడా లాంఛ్ చేసి అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పాడు. ఆగస్టులో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు రెండు వార్తలు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో సప్తసరాగాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని ఇన్‌సైడ్ టాక్. అంతేకాదు ఈ చిత్రం బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఉండబోతున్నట్టు ఇంకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన తెలుగు వాళ్లకు అండగా నిలిచే పాత్రలో తారక్ కనిపిస్తాడట. మొత్తానికి ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమాను సిద్దం చేస్తున్నాడని తాజా అప్‌డేట్ చెప్పకనే చెబుతోంది. ఈ క్రేజీ వార్త అఫీషియల్ కానప్పటికీ మూవీ లవర్స్, ఫ్యాన్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: నిన్నెవరూ మ్యాచ్ చేయలేరు.. 'అన్‌మ్యాచ్‌బుల్’ : రామ్‌చరణ్‌కు సమంత కితాబు!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# NTR 31 # JrNTR # PrashanthNeel # RukminiVasanth