రూ. 7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్‌చరణ్‌!

రూ. 7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్‌చరణ్‌!

1 month ago | 5 Views

పాన్‌ ఇండియా లెవల్లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న హీరోలలో రామ్‌ చరణ్‌ ఒకరు. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న చరణ్‌.. తనదైన నటనతో విమర్శకులను మెప్పించాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగులో టాప్‌ నటుల్లో ఒకరిగా ఎదిగారు. సినిమాల్లో నటించడమే కాకుండా... మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకు కావాల్సింది ఏదైనా.. దక్కించుకునే రేంజ్‌కు ఎదిగాడు. ఇక ఈక్రమంలోనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. ఓ బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ కొన్నాడట. టాలీవుడ్‌లో ఇంత ఖరీదైన లగ్జరీ కారు మరెవరికీ లేదట. కార్లంటే చాలా ఇష్టపడే రామ్‌ చరణ్‌.. తాజాగా రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్‌  కార్‌ను కొనుగోలు చేశారట. ఈ కారు ధర దాదాపు 7.50 కోట్ల రూపాయలు. ఇక ఈ స్పెక్టర్‌ కారు రోల్స్‌ రాయిస్‌ లోని ఇతర కార్ల కంటే డిజైన్‌, టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్‌ స్టేజ్‌లో ఉంటుంది. ఇక ఇప్పటికే చరణ్‌ గ్యారేజీలో అనేక కార్లు ఉన్నాయి. అలాగే సొంతంగా ప్రైవేట్‌ జెట్‌ కూడా కలిగి ఉన్నాడు. అంతేకాదు.. విమానయాన పరిశ్రమలో రామ్‌ చరణ్‌ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. రామ్‌ చరణ్‌ సినిమా నిర్మాణంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇంకా చదవండి: మా చిత్రానికి 'టాక్సిస్‌' అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే : యశ్ చెప్పిన వివరణ

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# రామ్‌ చరణ్‌     # కార్‌    

trending

View More