రొమాంటిక్‌ కామెడీతో  'రాజసాబ్‌': చిత్ర విశేషాలు పంచుకున్న మాళవిక

రొమాంటిక్‌ కామెడీతో 'రాజసాబ్‌': చిత్ర విశేషాలు పంచుకున్న మాళవిక

2 months ago | 41 Views

వరుస విజయాలతో జోష్‌ విూదున్న ప్రభాస్‌ ప్రస్తుతం 'రాజాసాబ్‌’తో బిజీగా ఉన్నారు. మారుతి  దర్శకత్వంలో సిద్ధమవుతోన్న ఈ చిత్రం రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌ సరసన మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమారి తదితరులు ఆడి పాడనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మాళవిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన తాజా చిత్రం 'యుధ్రా’ ప్రచారంలో పాల్గొన్న ఆమె 'రాజాసాబ్‌’ షూటింగ్‌పై ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. రాజాసాబ్‌ రొమాంటిక్‌ కామెడీగా రానుంది. నేను ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటివరకు సరైన స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూశాను. ఇందులో నా పాత్రకు ప్రాధాన్యం ఉంది. ఇలాంటి సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా.

అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది ముస్తాబవుతోంది. ప్రస్తుతం సగం షూటింగ్‌ పూర్తయింది.  ప్రభాస్‌ ఇంటి భోజనానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. భోజనమంటే ఏదో ఒక కర్రీ, బిర్యానీ తెప్పించడం కాదు.. ఏకంగా పెద్దపెద్ద పాత్రల్లో ఒక గ్రామానికి సరిపోయేంత ఆహారాన్ని ఏర్పాటుచేస్తాడు. ఇప్పటివరకు నేను అలాంటి రుచికరమైన ఆహారాన్ని తినలేదు అంటూ ప్రభాస్‌పై మాళవిక  ప్రశంసలు కురిపించారు.  'రాజాసాబ్‌’ విషయానికొస్తే.. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ఇది రానుంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో హారర్‌ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. ఇప్పటివరకూ ప్రభాస్‌ చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు, మూవీ విజువల్‌ వండర్‌లా ఉంటుందని నిర్మాత ఓ సందర్భంలో తెలిపారు.  ’బాహుబలి’ తర్వాత భారీ బడ్జెట్  చిత్రాల్లో కనిపించిన ప్రభాస్‌ పాత్ర ఇందులో రిఫ్రెషింగ్‌ ఉంటుందని, అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తుందని ఆయన అన్నారు. ఈ సినిమా వచ్చే ఏప్రిల్‌ 10న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇంకా చదవండి: నటీమణులు ధైర్యంగా ఉండాలి.. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి: నటి ఐశ్వర్య రాజేశ్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Rajasab     # Maruti     # MalavikaMohanan    

trending

View More