రెమ్యూనరేషన్ పెంచేసిన 'యానిమల్' బ్యూటీ!
3 months ago | 53 Views
చాలా రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న భామల్లో టాప్‌లో ఉంటుంది తృప్తి డిమ్రి. 'యానిమల్' సినిమాలో అందాలు ఆరబోసి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. మరోవైపు బ్యాడ్ న్యూజ్ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు బీటౌన్ దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే ఈ భామ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం తృప్తి డిమ్రి రూ.6 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచేసిందని ఇన్‌సైడ్ టాక్. కాగా తృప్తి డిమ్రి సక్సెస్ వేవ్‌లో దూసుకెళ్తుండటంతో రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేసిందన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తృప్తి డిమ్రి ఖాతాలో భూల్ భులయ్యా 3, ధడక్ 2, సినిమాలున్నాయి. వీటితోపాటు పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
ఇంకా చదవండి: 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్... మహేశ్‌బాబు గెస్ట్ అంటూ ప్రచారం
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Animal # TriptiDimri