అల్లు అర్జున్‌కు ఊరట ..  మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసిన హైకోర్టు కోర్టు

అల్లు అర్జున్‌కు ఊరట .. మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసిన హైకోర్టు కోర్టు

4 days ago | 5 Views

సినీ నటుడు అల్లు అర్జున్‌ ‌వ్యవహారంలో రోజంతా హైడ్రామా నడిచింది. ఆయనను అరెస్ట్ ‌చేయడం, చంచల్‌గూడ జైలుకు తరలించడం, వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేయడం వంటివన్నీ చకచకా సాగిపోయాయి. అరెస్ట్ ‌చేసి జైలుకు  తరలించిన అనంతరం తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. సంధ్య థియేటర్‌ ‌వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన అరెస్టయిన క్రమంలో అల్లు అర్జున్‌ ‌దాఖలు చేసిన క్వాష్‌ ‌పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసింది. అల్లు అర్జున్‌ ఏ11‌గా పేర్కొన్న పోలీసులు.. మధ్యాహ్నం 1.30కి అరెస్టు చేసినట్లు రిమాండ్‌ ‌రిపోర్టులో వెల్లడించారు. క్వాష్‌ ‌పిటిషన్‌పై విచారణ అత్యవసరం కాదని.. సోమవారం వినాలని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌కోర్టును కోరారు. అల్లు అర్జున్‌ అరెస్టయినందున బెయిల్‌ ‌కోసం అవసరమైతే మరో పిటిషన్‌ ‌వేసుకోవాలన్నారు. క్వాష్‌ ‌పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అల్లు అర్జున్‌ ‌తరఫు న్యాయవాది నిరంజన్‌ ‌రెడ్డి వాదనలు వినిపించారు.‘అల్లు అర్జున్‌ ‌తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్‌కు వెళ్తారు. థియేటర్‌ ‌యాజమాన్యం, నిర్మాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అల్లు అర్జున్‌ ‌రాత్రి 9.40కి సంధ్య థియేటర్‌కు వెళ్లి మొదటి అంతస్తులో కూర్చున్నారు. తొక్కిసలాటలో మరణించిన మహిళ కింద అంతస్తులో ఉన్నారు‘ అని అల్లు అర్జున్‌ ‌తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మధ్యాహ్నం అడగ్గానే లంచ్‌ ‌మోషన్‌కు అనుమతివ్వడం తప్పుడు సంకేతం ఇస్తుందని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌కోర్టుకు తెలిపారు. క్వాష్‌ ‌పిటిషన్‌లో మధ్యంతర బెయిల్‌ ఇవ్వొచ్చా? లేదా? అనే అంశంపై వాదించాలని ఈ సందర్భంగా హైకోర్టు పీపీకి సూచించింది. థియేటర్‌కు వెళ్లొద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు ముందుగానే సమాచారం ఇచ్చారని పీపీ కోర్టుకు తెలిపారు. భారీగా జనం ఉంటారని తెలిసినప్పటికీ అల్లు అర్జున్‌ ‌వెళ్లారని వివరించారు. మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని క్వాష్‌ ‌పిటిషన్‌లో ఎక్కడా కోరలేదని పీపీ వాదనలు వినిపించారు. క్వాష్‌ ‌పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరం లేదని, సోమవారం విచారించాలని కోరారు. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన భద్రత ఇవ్వలేదని అల్లు అర్జున్‌ ‌న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు కూడా భద్రత కన్నా అల్లు అర్జున్‌ను చూసేందుకే ఎక్కువ ఉత్సాహం చూపారని తెలిపారు. అల్లు అర్జున్‌ ‌భద్రత సిబ్బంది తోయడంతోనే తొక్కిసలాట జరిగినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు దారుడి భార్య మరణించింది. కుమారుడు వెంటిలేటర్‌పై ఉన్నాడని పీపీ కోర్టుకు వివరించారు. అందుకే అల్లు అర్జున్‌కు ఎలాంటి ఊరట ఇవ్వొద్దని పీపీ తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ‌తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఎఫ్‌ఐఆర్‌ను పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్‌ ‌వేశాం. పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగానే అరెస్టు చేశారు. అందువల్ల ఈ పిటిషన్‌ ‌ద్వారానే మధ్యంతర బెయిల్‌ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నందున మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరారు. అర్ణబ్‌ ‌గోస్వామి, మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్‌ ‌కు రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్‌ను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రెగ్యులర్‌ ‌బెయిల్‌ ‌కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని సూచించింది.  

రోజంతా హైడ్రామా

అంతకుముందు తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన అల్లు అర్జున్‌కి బిగ్‌షాక్‌ ‌తగలింది. ఆయన‌ను 14 రోజుల రిమాండ్‌కు తరలించాలని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. బన్నీ రావటం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందనీ, అందుకే ఆయన్ను అరెస్టుచేశామని పోలీసులు కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి అర్జున్ కు రిమాండ్‌ ‌విధించారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం ఆయన ఇంటి వద్ద అరెస్ట్ ‌చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అరెస్టు చేయడానికి తన ఇంటికి వొచ్చిన పోలీసులకు అల్లు అర్జున్‌  ‌సహకరించి స్టేషన్‌కు వొచ్చారు. ఇప్పటికే సంధ్య థియేటర్‌ ‌యజమానితోపాటు అక్కడ సెక్యూరిటీ వారిని కూడా పోలీసులు అరెస్ట్‌చేశారు. వైద్య పరీక్షల కోసం అల్లు అర్జున్‌ ‌ను ఉస్మానియాకు తీసుకుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను పోలీసులు నాంపల్లి క్రిమినల్‌ ‌కోర్టులో హాజరు పరిచారు. గాంధీ హాస్పిటల్‌లో అల్లు అర్జున్‌కు బీపీ, షుగర్‌ ‌పరీక్షలతో పాటు, కొవిడ్‌-19 ‌టెస్ట్ ‌కూడా చేసినట్లు  హాస్పిట‌ల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ‌సునీల్‌ ‌తెలిపారు. అన్ని పరీక్షల్లో ఆయనకు సాధారణ ఫలితాలు వొచ్చాయని వెల్లడించారు. ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించామని, భద్రతా కారణాల రీత్యా ఆయనను సూపరింటెండెంట్‌ ‌కార్యాలయంలో వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పోలీసులు ఆయన్ను నాంపల్లి క్రిమినల్‌ ‌కోర్టుకు తరలించారు. అరెస్ట్ అం‌శంలో చట్టప్రకారం ముందుకెళ్తున్నామని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల సందర్భంగా గాంధీ హాస్పిటల్‌కి వొచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు ఆయన అభిమానులు, రోగులకు సహాయంగా వొచ్చిన వారి బంధువులు ఎగబడ్డారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ కనిపించారు. హాస్పిటల్‌ ‌సిబ్బంది కూడా అల్లు అర్జున్‌ను ఫొటోలు తీసేందుకు ఆసక్తి చూపారు. అనంతరం నాంపల్లి కోర్టుకు హాజరుపర్చారు. అల్లు అర్జున్‌పై పలు సెక్షన్లలో కేసు నమోదైంది. దీంతో ఆయన తరపు న్యాయవాది హైకోర్టుని ఆశ్రయించారు.

Actor Allu Arjun remanded|അല്ലു അർജുനെ 14 ദിവസത്തേക്ക് റിമാൻഡ് ചെയ്ത്  മജിസ്ട്രേറ്റ്, ജയിലിലേക്ക് മാറ്റുക ഹൈക്കോടതി തീരുമാനം അനുസരിച്ച്

పుష్ప 2 ప్రీమియర్‌ ‌షోలు ఈనెల 4న రాత్రి 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌ ‌వద్దకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. సరిగ్గా అదే సమయంలో అల్లు అర్జున్‌ ‌తన సతీమణి స్నేహతో కలిసి థియేటర్‌కు వచ్చారు.  థియేటర్‌ ‌యాజమాన్యం ముందస్తుగా ఎలాంటి  భద్రతా చర్యలు తీసుకోలేదు.  ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి సెక్యూరిటీ  ఏర్పాట్లు చేయలేదు. కాగా, బన్నీ రాకతో అక్కడ ఒక్కసారిగా సంభవించిన తొక్కిసలాటలో రేవతి (36) అనే మహిళ అక్కడికక్కడే మరణించగా,  ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడి, ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే థియేటర్‌ ‌వద్ద సంభవించిన తొక్కిసలాటకు గానీ, రేవతి మృతికి గానీ అల్లు అర్జున్‌కు సంబంధం లేదనీ, మృతురాలి భర్త భాస్కర్ మీడియాకు వెల్లడించారు. తమ కేసును ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే,  కేసు నమోదుచేసి అరెస్ట్ ‌చేశామని హైదరాబాద్‌ ‌సిపి సివి ఆనంద్‌ ‌వెల్లడించారు. అయితే ఈ కేసులో  సినీ నటుడు అల్లు అర్జున్‌ ‌హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అల్లు అర్జున్‌ ‌తరఫు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. ’అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే మెన్షన్‌ ‌చేయాలి కదా’ అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. బుధవారం రోజు పిటిషన్‌ ‌ఫైల్‌ ‌చేశామని, క్వాష్‌ ‌పిటిషన్‌ను వేసినట్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్‌ ‌తరఫు న్యాయవాది నిరంజన్‌ ‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్‌ ‌తరపు న్యాయవాది కోరారు. బుధవారం పిటిషన్‌ ‌దాఖలు చేసి, నెంబర్‌ అయినా.. కోర్టు సిబ్బంది బిజీగా ఉండడం వల్ల లిస్టులోకి రాకపోయి ఉండొచ్చని వివరించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌విచారించాలనడం సరైనది కాదని ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సోమవారం వరకూ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్‌ ‌తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. అయితే, పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది.. న్యాయస్థానానికి తెలిపారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేసినట్లు పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం బన్ని పిటిషన్‌పై విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.

కేసు ఉప‌హ‌రించుకుంటా : మృతురాలి భ‌ర్త‌

ఇదిలావుంటే సినీ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసు మరో మలుపు తిరిగింది. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన రేవతి భర్త భాస్కర్‌ ‌స్పందించారు. ఈ కేసును విత్‌ ‌డ్రా చేసుకుంటానని తెలిపారు. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని కోరారు. ఈ ఘటనతో ఆయనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ‘నా కుమారుడు ’పుష్ప 2’ సినిమా చూస్తానంటే సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లా. ఇందులో అల్లు అర్జున్‌ ‌తప్పేం లేదు. ఆయన్ను అరెస్టు చేయనున్నట్టు పోలీసులు నాకు సమాచారం ఇవ్వలేదు. హాస్పిటల్‌లో ఉన్న నేను ఫోన్‌లో అరెస్టు వార్త చూశా.  కేసు విత్‌‌డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా‘ అని భాస్కర్‌ ఓ ‌వీడియోలో పేర్కొన్నారు.

ఇంకా చదవండి: వైరల్‌గా మంచులక్ష్మి పోస్ట్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# పుష్ప2     # అల్లుఅర్జున్‌     # రష్మికమందన్నా    

trending

View More