ఆస్పత్రి నుంచి రవితేజ డిశ్చార్జ్‌!

ఆస్పత్రి నుంచి రవితేజ డిశ్చార్జ్‌!

3 months ago | 37 Views

 మాస్‌ మహారాజ రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు. సాఫీగా సాగిన సర్జరీ అనంతరం విజయవంతంగా డిశ్చార్జ్‌ అయ్యాను. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మెసేజ్‌లు చేసిన వారందరికి ధన్యవాదాలు అంటూ రవితేజ రాసుకొచ్చాడు.


రవితేజ 67 ప్రాజెక్ట్‌ షూటింగ్‌ సమయంలో రవితేజకు ప్రమాదం జరుగగా.. అతడి కుడిచేతికి గాయం అయ్యింది. అయితే నొప్పిభరిస్తునే షూటింగ్‌లో పాల్గోన్నాడు రవితేజ. అయితే షూటింగ్‌ అనంతరం ఈ గాయం ఎక్కువ కావడం వలన చిత్రబృందం ఆయనను ఆస్పత్రికి తరలించారు. రవితేజను పరిశీలించిన వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి, ఆరు వారాల పాటు రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు. ఇక రవితేజకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న అతని అభిమానులు ఆస్పత్రికి తరలివస్తున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు.

ఇంకా చదవండి: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం

# MrBachchan     # RaviTeja     # BhagyashriBorse    

trending

View More