
రామ్‌చరణ్‌తో నటించనున్న రష్మిక
1 month ago | 5 Views
అగ్ర కథానాయిక రష్మిక మందన్న పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. ‘పుష్ప-2’తో గత ఏడాది పాన్‌ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ సొగసరి తాజాగా ‘ఛావా’ సినిమాతో మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ‘ఛావా’ సినిమాలో ఈ భామ అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న తాజాగా తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్‌కు అంగీకరించిందని వార్తలొస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రామ్‌చరణ్ ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
బుచ్చిబాబు సానా దర్శకుడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు రామ్‌చరణ్. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌పై దృష్టి పెట్టారు దర్శకుడు సుకుమార్. గ్లోబల్ ఆడియెన్స్‌కు చేరువయ్యేలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. చరణ్, రష్మిక మందన్న ఇప్పటివరకూ కలిసి నటించలేదు. దీంతో వీరిద్దరి జోడీ కొత్తగా ఉంటుందనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నారని అంటున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో కథానాయిక విషయంలో లెక్కలు మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం రష్మికకే అవకాశాలున్నాయని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తున్నది.
ఇంకా చదవండి: గోలీమార్ సిక్వేల్ రెడీ అవుతున్న పూరీ
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!